దిల్ రాజు సినిమాలు నిర్మించినా, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాలైనా ఆయనకో లెక్క ఉంటుంది. లాభనష్టాలను భేరీజు వెయ్యడమే కాదు.. ఆ సినిమా కి ఎంత లాభమొస్తుందో అనేది ముందే ఓ అంచనాకు వస్తారు. అందుకే ఆయన కాంపౌండ్ నుండి చిన్న సినిమా వచ్చినా ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ చాలా ఆసక్తి, బోలెడన్ని అంచనాలు ఉంటాయి. ఇప్పుడు కూడా దిల్ రాజు శాకుంతలాన్ని విడుదల చేస్తున్నారు అనగానే అందరి అటెన్షన్ శాకుంతలంపై పడింది. అయితే ప్రమోషన్స్ విషయంలోనే దిల్ రాజు లెక్క తప్పింది.
శాకుంతలం గత నాలుగు రోజులుగా సెలబ్రిటీస్ షోస్, ప్రీమియర్స్ షోస్, ప్రెస్ షోస్ చూసాక దిల్ రాజు శాకుంతలం ఫలితాన్ని డిసైడ్ చేసేసినట్టుగా ఉన్నారు. అందుకే ప్రమోషన్స్ లైట్ తీసుకున్నారు. ఓవర్సీస్ యాడ్స్ ని పట్టించుకులోలేదు. అంటే శాకుంతలానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా వేస్ట్ అనుకున్నారేమో దిల్ రాజు, ఫలితాన్ని ముందే అంచనా వేసి ప్రమోషన్స్ ఆపేసినట్టుగా శాకుంతలం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమా ఏ సందర్భంలోను ఆడియన్స్ కి ఎక్కదు, ఈ సినిమాపై రూపాయి పెట్టినా వర్కౌట్ అవ్వదని అర్ధమై దిల్ రాజు అలా సైలెంట్ గా ఉండిపోయాడేమో అని అనిపించకమానదు. శాకుంతలం చూసి పిల్లలు సీరియల్ లా ఉంది అంటే.. సమంతని శకుంతలగా చూడలేకపోయామంటున్నారు పెద్దవాళ్ళు. అసలు ప్రీమియర్స్ ప్రదర్శించడమే శకుంతలానికి పెద్ద దెబ్బ, ఆ సినిమా ఏంటి బ్రో.. గుణశేఖర్ అవుట్ డేటెడ్ అయ్యిపోయాడు.. ఇక సినిమాలు ఆపేస్తే బెటర్, శాకుంతలం చూస్తే బోర్ బోర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.