హీరోయిన్ గా ప్రేమ టాలీవుడ్ లో నేచురల్ నటనతో తనకంటూ ఓ ప్రత్యేకతని చూపించినా ఆమె ఎందుకో స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు తెచ్చుకోలేకపోయింది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించినా ఆమెకి అనుకున్నంత గుర్తింపు దక్కలేదు. కన్నడలో మాత్రం టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. చాలాకాలం క్రితమే ఇండస్ట్రీని వదిలేసిన ప్రేమ మళ్ళీ కొన్నాళ్ల క్రితం సుమ క్యాష్ షోలో లైలా లాంటి హీరోయిన్స్ తో సందడి చేసింది. ఇప్పుడు ఇన్నాళ్ళకి ప్రేమ రెండో పెళ్లి వ్యవహారంతో హైలెట్ అయ్యింది. ప్రేమ గతంలో జీవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లాడిన కొంత కాలానికే జీవన్ కి ప్రేమ విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటుంది.
అయితే ఈమధ్యన ప్రేమ రెండో పెళ్లి వ్యవహారం బాగా చక్కర్లు కొట్టడంతో ఓ ఇంటర్వ్యూలో ప్రేమ తన వ్యక్తిగత విషయాలని బయటపెట్టింది. నేనూ.. జీవన్ పెళ్లయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకున్నాము, విడాకుల విషయం ముందుగా నా తల్లితండ్రులకే చెప్పాను. వాళ్ళు నాకు సపోర్ట్ చెయ్యడమే కాకుండా నాకు తోడుగా నిలబడ్డారు. అలా విడాకులు తీసుకున్నాక చాలామంది ఆలోచనా శక్తి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు. కానీ నేను దానిని ఓ ఛాలెంజ్ గా తీసుకున్నాను, పెళ్లి, విడాకులే లైఫ్ కాదు.. అందుకే పోరాడాను, నిలబడ్డాను.
అంతకుముందు సెన్సిటివ్ గా, ఎమోషనల్ గా ఉండేదాన్ని.. కానీ విడాకుల తర్వాత స్ట్రాంగ్ అయ్యాను, నాపై రెండో పెళ్లి రూమర్స్ వచ్చాయి. లైఫ్ లో పెళ్లి అనేది ఉండాలి. నాకు తగిన మంచి వ్యక్తి దొరికితే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇక నాపై మరో రూమర్ కూడా క్రియేట్ చేసారు. నాకు క్యాన్సర్ ఉంది.. అందుకే ఆస్ట్రేలియాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని. కానీ నేను డిప్రెషన్ కి లోనై ఆస్ట్రేలియా వెళ్ళాను తప్పితే నాకు ఎలాంటి క్యాన్సర్ లేదు అంటూ ప్రేమ ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ రివీల్ చేసింది.