సమంత లాంటి పాన్ ఇండియా యాక్ట్రెస్ సినిమా విడుదలవుతుంది అంటే ఎంత హంగామా ఉండాలి, ఎంత హడావిడి ఉండాలి. కానీ ఇప్పుడు శాకుంతలం విషయం చూస్తే అలా గాలికొదిలేశారేమిటో అంటారు. రుద్రమదేవి తో అందరిని మెప్పించిన గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన శాకుంతలం నేడు పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలైతే ముందు నుండి లేవు. ఏదో ప్రమోషన్స్ తో ఆ అంచనాలు పెంచుదామనుకుని.. నామ మాత్రంగా ప్రమోషన్స్ ముగించేశారు.
దిల్ రాజు ముందుండి నడిపించినా.. శకుంతలానికి బజ్ క్రియేట్ అవ్వలేదు. అటు ప్రమోషన్స్ పరంగా వీక్, ఇటు బజ్ పరంగా వీక్ గా ఉన్న శాకుంతలం నేడు విడుదలైన థియేటర్స్ దగ్గర అంతగా సందడి కనిపించడమే లేదు. అంత పెద్ద సినిమా, పాన్ ఇండియా ఫిలిం, 3D మూవీ అంటూ గొప్పలు పోయి విడుదల సమయానికి టీమ్ చేతులెత్తేసింది. ఏదో గుణశేఖర్, ఆయన పిల్లలు, దేవ్ మోహన్ కొద్దిగా ప్రమోట్ చేసినా సమంత లేకపోతే ఎవరు చూస్తారు అన్నట్టుగా ఆ ప్రమోషన్స్ ఉన్నాయి.
ముంబై, చెన్నై, కొచ్చి, చివరిగా హైదరాబాద్ లో ఓ ప్రెస్ మీట్ తో ముగించేశారు. ప్రమోషన్స్ విషయంలోనే వీక్ గా కనిపించిన శాకుంతలం టీమ్.. సినిమా విడుదలయ్యాక మరింత డల్ అయ్యింది. ఏమేర శాకుంతలం ప్రేక్షకులని మెప్పిస్తుందో అనే కంగారులో గుణశేఖర్ బ్యాచ్ కనిపిస్తుంది.