రామ్ చరణ్-ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో ఇద్దరూ గ్లోబర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. ఇద్దరూ ఈ గ్లోబల్ స్టార్ క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడేసుకుంటున్నారు. అందులో భాగంగానే రామ్ చరణ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ని పిలిచి బర్త్ డే పార్టీ ఇవ్వడం.. ఇందులో టాలీవుడ్ ప్రముఖులు చాలా తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఆస్కార్ విజేతలైన కీరవాణి, రాజమౌళి ఫామిలీస్ సందడి చేశాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తాజాగా తన ఇంట్లోనే ఇచ్చిన పార్టీ బాగా హైలెట్ అయ్యింది.
ఎన్టీఆర్ స్పెషల్ పార్టీకి కారణాలు తెలియదు కానీ.. ఈ ఎన్టీఆర్ పర్సనల్ పార్టీలో అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ లాంటి దిగ్గజాలు సందడి చెయ్యడం, స్పెషల్ గా అయన కోసమే ఎన్టీఆర్ పార్టీ ఇవ్వడం ఇవన్నీ ఎన్టీఆర్ ప్లానింగ్‌లో భాగమని తెలుస్తున్నాయి. అమెరికా ఆస్కార్ కోసం వెళ్లి అక్కడ హాలీవుడ్ స్టార్స్‌తో మంచి రాపో మెయింటైన్ చేసిన ఎన్టీఆర్ ఇలా ఆ స్నేహాన్ని ఇంటివరకు తీసుకురావడం అనేది మాములు విషయం కాదు. ఈ పార్టీకి కొద్దిమంది టాలీవుడ్ ప్రముఖులే హాజరు కావడం కూడా హాట్ టాపిక్ అయిన విషయమే.
త్రివిక్రమ్, కొరటాల, రాజమౌళి ఇలా చాలాకొద్దిమందితోనే ఎన్టీఆర్ ఈ పర్సనల్ పార్టీని ఆరెంజ్ చేశాడు. ఇలా పార్టీలతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎవ్వరూ తగ్గడం లేదు. వాళ్ళ వాళ్ళ ప్లానింగ్స్ తో ఫాన్స్ కి కిక్ ఇస్తున్నారు. కాకపోతే ఇంత మంచి దోస్తులు ఒకరి పార్టీకి ఒకరు హాజరు కాకపోవడమే అభిమానుల్లో అసంతృప్తికి కారణమైంది.