Advertisementt

తారక్ పార్టీలో త్రివిక్రమ్.. రూమర్స్‌కు తెర

Sun 30th Apr 2023 12:12 PM
trivikram srinivas,jr ntr,ntr party,no issues  తారక్ పార్టీలో త్రివిక్రమ్.. రూమర్స్‌కు తెర
Trivikram Srinivas At Young Tiger NTR Party తారక్ పార్టీలో త్రివిక్రమ్.. రూమర్స్‌కు తెర
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. ఇంతకుముందు అరవింద సమేత చేసిన ఈ జంట.. మళ్ళీ మరో మూవీని ఎనౌన్స్ చేసింది. కానీ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తో బిజీ అవడం ఆతర్వాత పాన్ ఇండియా మార్కెట్ మీద ఇష్టం పెరగడంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టెయ్యడంతో ఇకపై వీరి కలయికలో మూవీ రాదేమో అనుకున్నారు. అరవింద సమేత సమయంలో తండ్రి హరికృష్ణ మరణం సంభవించినప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి బాగా దగ్గరయ్యాడు కూడా.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఇద్దరి మధ్యన బేదాభిప్రాయాలు తలెత్తేయానే టాక్ నడిచింది. కానీ వీరి మధ్యన ఎలాంటి పొరపొచ్చాలు లేవని.. గత రాత్రి ఎన్టీఆర్ ఇచ్చిన పార్టీతో తేలిపోయింది. ఈ పార్టీలో రాజమౌళి, కొరటాల.. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నవారు. దిగ్గజాలు అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్‌ లాంటి వారితో ఈ స్పెషల్ పార్టీకి త్రివిక్రమ్ ని ఎన్టీఆర్ ఆహ్వానించాడు.

సుకుమార్, ఇక ఎన్టీఆర్ కి సన్నహితులైన వారెవరూ కనిపించకపోగా.. త్రివిక్రమ్ ఈ పార్టీలో కనిపించడంతో వీరి మధ్యన స్నేహం అలానే ఉంది, వీరి మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, ఈ కాంబో ఫ్యూచర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది అంటూ వార్తలు రావడంతో ఎన్టీఆర్ ఫాన్స్ చాలా హుషారుగా ఉన్నారు.

Trivikram Srinivas At Young Tiger NTR Party:

No Issues Between Jr NTR And Trivikram Srinivas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ