పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సన్ అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని పవన్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈమధ్యన అకీరా నందన్ పుట్టిన రోజునాడే పవన్ ఫాన్స్ రచ్చ చేసారు. అకీరా ఎంట్రీ ఎప్పుడు, ఆయన హీరోగా ఎవరితో సినిమా చేస్తాడు? అసలు హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అంటూ అనేకరకాల ప్రశ్నలు రేజ్ చేసారు. మరోపక్క పవన్ ఫాన్స్ పై పవన్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ ఫైర్ అవుతుంది. ఆయన పవన్ కొడుకు కాదు నా కొడుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
అయితే అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అందరిని సర్ ప్రైజ్ చేసాడు. అకీరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారడం అస్సలు పవన్ ఫాన్స్ ఊహించనిది. అకీరా నందన్ ఎప్పటినుండో మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఓ షార్ట్ ఫిలిం ద్వారా అకీరా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అయితే అకీరా కెరీర్ కు సంబంధించిన ప్లానింగ్ పవన్ కళ్యాణ్ ఓ యంగ్ హీరోకి అప్పజెప్పినట్లుగా టాక్.
పంజా సినిమాలో విలన్ గా నటించి ఇప్పుడు హీరోగా ప్రత్యేకతని చూటుకుంటున్న అడివి శేష్ కి పవన్ కళ్యణ్ అకీరా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. మరి అకీరా హీరో అయినా లేదంటే మరే రకంగా అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అతని వెనుక అడివి శేష్ ఉంటాడని తెలుస్తుంది. సో అకీరా గురించి పవన్ కన్నా, రేణు కన్నా ముందుగా అడివి శేష్ ని అప్రోచ్ అవ్వాలేమో.