Advertisementt

చరణ్ ఫస్ట్ గిఫ్ట్‌పై ఉపాసన కామెంట్స్

Fri 28th Apr 2023 07:29 PM
ram charan,upasana,first gift,upasana interview  చరణ్ ఫస్ట్ గిఫ్ట్‌పై ఉపాసన కామెంట్స్
Upasana Latest Interview goes Viral చరణ్ ఫస్ట్ గిఫ్ట్‌పై ఉపాసన కామెంట్స్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-ఉపాసన నిన్నటివరకు వేకేషన్స్ లో ఎంజాయ్ చేసి హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. దుబాయ్, మాల్దీవ్స్ అంటూ ఈ జంట సమ్మర్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేసింది. దుబాయ్, మాల్దీవులకు వెళ్లొచ్చిన ఉపాసన తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో తన బంధం ఎలా ఏర్పడింది, తన డైట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్ తనకి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏమిటో అనేది ఇప్పటికీ తనకి గుర్తున్నట్లుగా చెప్పింది. చరణ్ తనకి మొదటగా హార్ట్ సింబల్ ఉన్న చెవి దుద్దులు గిఫ్ట్ గా వాలెంటైన్స్ డే రోజున ఇచ్చాడని, దానికి బదులుగా తాను చరణ్ కి బోలెడంత ప్రేమని అందించినట్లుగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

ఇక తమ బేబీ తో తాము ప్రపంచాన్ని చుట్టేస్తున్నామని, కడుపుతో ఉన్న బేబీ తో ఇలా టూర్ కి వెళుతుంటే మనసంతా సంతోషంగా ఉంది అంటూ చెప్పింది. అంతేకాకుండా తన డైట్ గురించికూడా ఉపాసన రివీల్ చేసింది. ప్రెగ్నెన్సీలో ఉంటే చాలామంది పది నుండి పన్నెండు కిలోల బరువు పెరుగుతారు. తమ కోసం బిడ్డ కోసం తింటారు. కానీ నేను వెయిట్ పెరగడం లేదు. అంటే నేను నా కోసం, బిడ్డ కోసం తినడం లేదు. 

ఆలా అని ఏమి తినకుండా ఉండడం లేదు, చాలా తక్కువగా బలమైన ఆహరం మాత్రమే తీసుకుంటున్నాను. బలమైన ఆహారం తగిన మోతాదులో తీసుకుంటున్నానుఅంటూ ఉపాసన తన డైట్ సీక్రెట్స్ ని ఆ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది.

Upasana Latest Interview goes Viral :

Upasana Comments on Ram Charan First Gift

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ