మహేష్ బాబు సూపర్ స్టార్ గా విశేషమైన అభిమానులని సంపాదించుకున్నారు. ఆయన సూపర్ స్టార్ గా వెలిగిపోవడమే కాదు.. అనేకమంది పేదల జీవితాల్లో వెలుగుని నింపుతున్నారు. మహేష్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నా ఆయన వైఫ్ నమ్రత మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
తండ్రి కృష్ణ గారి మాదిరే మహేష్ కి సేవ గుణం ఎక్కువ. తాజాగా రెండేళ్ల వయసు గల చిన్నారి శివాలికి మహేశ్ బాబు ఫౌండేషన్ తరపున గుండెకు శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆ చిన్నారి సంతోషంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంది. మహేష్ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేసుకుని ఆనందంగా ఉన్న ఆ బిడ్డ తల్లితండ్రులు.. తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. దీనితో మరోసారి మహేశ్ బాబు మంచి మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా నువ్వు సూపర్ స్టారేనయ్యా అంటూ కొనియాడుతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి పారిస్ ట్రిప్ లో వేసవి సెలవలని ఎంజాయ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ తో కలిసి SSMB28 షూటింగ్ చేస్తున్న మహేష్ తన తదుపరి చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చెయ్యబోతున్న విషయం తెలిసిందే.