Advertisementt

ఒకేసారి పవన్-మహేష్ తో లక్కే లక్కు!

Thu 13th Apr 2023 07:14 PM
lucky heroine,sreeleela,pawan kalyan,mahesh babu  ఒకేసారి పవన్-మహేష్ తో లక్కే లక్కు!
Sreeleela Got Chance in Pawan and Mahesh Babu Film ఒకేసారి పవన్-మహేష్ తో లక్కే లక్కు!
Advertisement
Ads by CJ

చేసింది జస్ట్ రెండు సినిమాలే. ఒకటి ప్లాప్, ఒకటి హిట్టు. అది కూడా తన వలనే కోట్లు కొల్లగొట్టింది ఆ సినిమా. అందుకే అమ్మడుకి అంత డిమాండ్. ఆమె శ్రీలీల. టాలీవుడ్ హీరోలంతా శ్రీలీల నమ జపమే చేస్తున్నారు. అమ్మడు లక్కు ఎలా ఉంది అంటే.. ధమాకాకి కేవలం శ్రీలీల ని చూసే థియేటర్స్ లో జనాలు చూశారనేది బల్లగుద్ది చెప్పే మాట. రవితేజ ఓవరేక్షన్ కి ఎవరూ రారు. కానీ శ్రీలీల ఎనర్జిటిక్ డాన్స్ చూసి అందరూ పడిపోయారు. కాబట్టే థియేటర్స్ లో ధమాకా మోత మోగిపోయింది. ఇప్పుడు అమ్మడు సూది తిరిగిపోయింది. ఒకేసారి మహేష్ బాబు-పవన్ కళ్యాణ్ చిత్రాల్లో నటిస్తుంది.

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్-మహేష్ తో SSMB28 షూటింగ్స్ లో శ్రీలీల యమా బిజీ. మధ్యలో యంగ్ హీరోల సినిమాలు ఉండనే ఉన్నాయి. అవన్నీ ఓ ఎత్తు.. పవన్-మహేష్ మూవీస్ ఓ ఎత్తు. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో జాయిన్ అయ్యింది. రేపో మాపో మహేష్ SSMB28 సెట్స్ లోకి జాయిన్ అవుతుంది. ఇదంతా చూస్తే లక్కు కాక ఇంకేం అనాలి. ఒక్కసారే స్టార్ హీరోల సినిమాలు.. అది కూడా కెరీర్ ఆరంభంలో.

శ్రీలీల మనసు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నా ఆమె మాత్రం గుంభనంగానే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. కామ్ గా తనకొచ్చిన సినిమాల షూటింగ్స్ తో బిజీగా డే అండ్ నైట్ షూటింగ్స్ చేసుకుంటూ డేట్స్ క్లాష్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది పాప.

Sreeleela Got Chance in Pawan and Mahesh Babu Film:

Young Heroine Sreeleela Name Creates Sensation

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ