బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 56 ఏళ్ళు వచ్చేసినా పెళ్లి మాత్రం చేసుకోకుండా బ్యాచులర్ లైఫ్ నే ఎంజాయ్ చేస్తున్నాడు. పలువురు హీరోయిన్స్ తో డేటింగ్స్ చేసినా.. ఎందుకో సల్మాన్ ఖాన్ పెళ్లి వరకు ఆ బంధాన్ని తీసుకెళ్లలేకపోయాడు. ప్రస్తుతం కూడా ఓ రిలేషన్ లో ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. కానీపెళ్లి మాత్రమే చేసుకోడు. అయితే సల్మాన్ ఖాన్ జుహీ చావ్లా తండ్రి పెళ్ళికి ఒప్పుకుని ఉంటే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడట.
జుహీ చావ్లా వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టమని సల్మాన్ ఖాన్ పలు సందర్భాల్లో చెప్పాడు. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా ఎంటర్ అయ్యి అప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో జూహ్లీ చావ్లా మీద ఇష్టంతో ఆమె తండ్రిని కలిసి పెళ్లి ప్రపోజల్ పెట్టాడట. కానీ జుహీ చావ్లా తండ్రి మాత్రం జుహీకి అప్పుడే పెళ్లి చెయ్యడానికి, అందులోను సల్మాన్ ఖాన్ తో చెయ్యడానికి ఒప్పుకోలేదట. అదే విషయం సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అప్పుడు నేను స్టార్ ని కాదు, నా దగ్గర ఏమి లేదని ఆయన ఆలా అని ఉంటారంటూ సల్మాన్ నవ్వేసాడు.
ఈ విషయాన్ని జుహీ చావ్లా కూడా ఓ సందర్భంలో చెప్పింది. సల్మాన్ ఖాన్ తన తండ్రి దగ్గరికి వచ్చి పెళ్లి విషయం అడిగాడని, అప్పుడే నేను హీరోయిన్ గా కాస్త నిలదొక్కుకుంటున్నాను, సల్మాన్ ఖాన్ హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు.. నేను అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు.. అందుకే మా తండ్రి రిజెక్ట్ చేసారంటూ చెప్పింది. అప్పుడే జుహీ తండ్రి ఒప్పేసుకుని ఉంటే కండల వీరుడి పెళ్లి ఎప్పుడో అయ్యేది.