రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ టాలీవుడ్ అవకాశాలు కోసం కిందా మీదా పడుతుంది. సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ గ్లామర్ ఫొటోస్ తో రచ్చ చేసినా.. తెలుగు హీరోలెవరూ రకుల్ ని కన్సిడర్ చెయ్యడమే లేదు. ఇక బాలీవుడ్ లో కూడా సీనియర్ హీరోలతో సినిమాలు చేసుకుంటున్న రకుల్ ప్రీత్ కమల్ హాసన్ ఇండియన్ 2 లో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అయితే తెలుగు సీనియర్ హీరోలకి ఇప్పుడు హీరోయిన్స్ కొరత బాగా ఉంది.
ఇప్పటికే కాజల్ అగర్వాల్, శృతి హాసన్ లాంటి గ్లామర్ డాల్స్ బాలయ్య, చిరు సినిమాల్లో నటించేస్తున్నారు. నాగార్జునతోను కాజల్ నటించేసే.. కానీ ఆమె ప్రెగ్నెన్సీ వలన అది మిస్ అయ్యింది. రకుల్ గనక చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లాంటి హీరోలకి కనెక్ట్ అయితే మళ్ళీ రెండుమూడేళ్లు టాలీవుడ్ లో బిజీ అవుతుంది. కాదు.. నాకు ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేషే కావాలంటే ఆమె ఇక టాలీవుడ్ నుండి పూర్తిగా తప్పుకున్నట్టే.
మరి టాలీవుడ్ సీనియర్స్ నుండి అవకాశాలు వస్తే రకుల్ ప్రీత్ వదులుకోకుండా ఎస్ చెబితే కొన్నాళ్లు వార్తల్లో ఉంటుంది.. లేదంటే ఇక అంతే. ఆమె అవకాశాలు కాజల్ పట్టుకుపోవడం ఖాయం.