Advertisementt

వేరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోను అన్న బన్నీ

Wed 12th Apr 2023 08:32 PM
allu arjun,dhanush  వేరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోను అన్న బన్నీ
Allu Arjun will not share screen with another hero? వేరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోను అన్న బన్నీ
Advertisement
Ads by CJ

ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అల్లు అర్జున్ నో అన్నాడా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఈ విషయాన్ని ఎవరు బయట పెట్టారంటే.. కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్. ఆయన విడుదల సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ ద్వారా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఆ సందర్భంగా వెట్రిమారన్ టాలీవుడ్ లోని టాప్ హీరోల గురించి చాలా మట్లాడారు. ముఖ్యంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ మూవీస్ పై ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

అల్లు అర్జున్ తో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చెయ్యాలి అనుకున్నాను, గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేసేందుకు చర్చలు కూడా జరిగాయి. తర్వాత నేను డైరెక్ట్ చేసిన అడుకాలం తెలుగులోనూ పందెం కోళ్లుగా రిలీజ్ అయ్యింది. అప్పుడే అల్లు అర్జున్ చెన్నై వచ్చి నన్ను కలిశారు. తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దామనుకుంటున్నా ఓ మంచి కథ ప్రిపేర్ చేయమని అన్నారు. ఆ తర్వాత నేను వడ చెన్నై కథ చెప్పాను. ధనుష్ తో ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్ర చెయ్యమని అడిగాను. ఆ పాత్ర గురించి వివరించేందుకు హైదరాబాద్ వచ్చి గీత ఆర్ట్స్ ఆఫీస్ లోనే బన్నీకి స్క్రిప్ట్ వివరించాను. 

కథ విన్న అల్లు అర్జున్ మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇష్టం లేక నో చెప్పారు.. అంటూ అల్లు అర్జున్ తో మూవీపై వెట్రిమారన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.

Allu Arjun will not share screen with another hero? :

Allu Arjun says he will not share the screen with Dhanush

Tags:   ALLU ARJUN, DHANUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ