కన్నడలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF2 లో హీరో యశ్ కి పవర్ ఫుల్ విలన్ గా సంజయ్ దత్ అధీర పాత్రలో అదరగొట్టారు. ఆయన లుక్ విషయంలోనే అందరిని ఇంప్రెస్స్ చేసారు. అయితే తాజాగా సంజయ్ దత్ ఓ సినిమా షూటింగ్ లో ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. కన్నడలో భారీగా తెరకెక్కుతున్న కేడి సినిమా షూటింగ్ లో సంజయ్ దత్ గాయాలు పాలైనట్లుగా సమాచారం అందుతుంది. ఈరోజు బుధవారం బెంగుళూరులోని మగాడి రోడ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న కేడి మూవీలో కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్.. ఆ సినిమా సెట్స్ లో ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో.. అనుకోకుండా ఆ బాంబ్ బ్లాస్ట్ అవడంతో సంజయ్ దత్ మొహానికి, మోచేతికి గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. అక్కడ సెట్స్ లోనే డాక్టర్స్ ఫస్ట్ ఎయిడ్ చెయ్యగా.. తరవాత ఆయన అక్కడినుండి ముంబై వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది.
ఇక సంజయ్ దత్ కి గాయాలు అవడంతో కేడి షూటింగ్ కి కొద్దిపాటి బ్రేక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కెజిఫ్ తర్వాత సంజయ్ దత్ రేంజ్ పాన్ ఇండియా లెవల్ కి పెరిగిపోయింది. ఆయన తమిళంలో తెరకెక్కుతున్న విజయ్ లియో లోను కీలక పాత్ర పోషిస్తున్నారు.