Advertisementt

మరోసారి అనారోగ్యం బారిన సమంత

Wed 12th Apr 2023 05:33 PM
samantha ruth prabhu,shaakuntalam  మరోసారి అనారోగ్యం బారిన సమంత
Samantha fell sick again మరోసారి అనారోగ్యం బారిన సమంత
Advertisement
Ads by CJ

గత ఏడాది చాలా నెలలు సమంత మాయోసైటిస్ బారిన పడి అనారోగ్యం పాలైంది. కొద్ది నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటూ మేకప్ కూడా వేసుకోలేదు. మాయోసైటిస్ వ్యాధితో పోరాడి మళ్ళీ మాములు స్థితికి చేరుకున్న సమంత మరోసారి కెమెరాల ముందుకు వచ్చింది. శాకుంతలం ప్రమోషన్స్, ఖుషి షూటింగ్, ముంబై లో సిటాడెల్ షూటింగ్ అంటూ యమా బిజీగా గడుపుతుంది. సమంత నటించిన శాకుంతలం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

గత వారం రోజులుగా.. శాకుంతలం పాన్ ఇండియా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత ఈరోజు నుండి శాకుంతలం ప్రమోషన్స్ లో కానీ, అలాగే సినిమా షూటింగ్స్ కి హాజరవ్వకుండా ఉండిపోయింది. దాంతో చాలామందికి ఏమి అర్ధం కాలేదు. శాకుంతలం ప్రమోషన్స్ ఉన్నట్టుండి ఆపెయ్యడంపై రకరకాల న్యూస్ లు ప్రచారంలోకి వచ్చేసాయి. అంతేకాకుండా సమంత ఆరోగ్యంపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. 

దానితో సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రస్తుతం తనకి ఆరోగ్యం బాగోలేదని.. జ్వరం, గొంతు కూడా సరిగ్గా లేకపోవడంతో వీటి అన్నటికి బ్రేక్ ఇచ్చి కొద్దిగా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అని క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ సమంత అనారోగ్యంపై ఆమె అభిమానులు భయపడినా ఇప్పుడు.. జస్ట్ ఫీవర్, జలుబే కదా అని సరిపెట్టుకుంటున్నారు.

Samantha fell sick again:

Samantha Cancels Promotions For Shaakuntalam Due To Poor Health

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ