Advertisementt

పవన్ తో ఆమె, డిస్పాయింట్ అవుతున్న ఫాన్స్

Wed 12th Apr 2023 02:52 PM
priyanka,pawan kalyan  పవన్ తో ఆమె, డిస్పాయింట్ అవుతున్న ఫాన్స్
Pawan Kalyan Fans Unhappy With This Choice పవన్ తో ఆమె, డిస్పాయింట్ అవుతున్న ఫాన్స్
Advertisement
Ads by CJ

నిన్న సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్-సుజిత్ కాంబో మూవీ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ముంబై వెళతారు.. ముంబై పరిసర ప్రాంతాల్లో మొదలు కానున్న OG షూటింగ్ లో పాల్గొంటారనే న్యూస్ తో పాటుగా.. ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ పవన్ తో రొమాన్స్ చేయబోతుంది అనే న్యూస్ కూడా హైలెట్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ పక్కన ప్రియాంక అరుళ్ మోహన్ అని ఇంతవరకు మేకర్స్ చెప్పకపోయినా .. ఆ గాలివార్తని పట్టుకుని పవన్ ఫాన్స్ తెగ డిస్పాయింట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఆ పొట్టి పిల్లా, అందులోను ఎలాంటి క్రేజ్ లేని హీరోయిన్ ఏమిటి అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్, శర్వా శ్రీకారం, కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించినా ఆమెకి అంతగా బ్రేక్ ఇచ్చిన సినిమా లేకపోవడంతో పవన్ ఫాన్స్ కంగారు పడుతున్నారు.

మరి ఇది గనక మేకర్స్ దృష్టికి వెళితే.. హీరోయిన్ విషయంలో వేరే ఆలోచన చేస్తారో.. లేదంటే పవన్ ఫాన్స్ భయపడుతున్నట్టుగా ఈ గాలి వార్తనే నిజం చేస్తారో చూడాలి.

Pawan Kalyan Fans Unhappy With This Choice:

Priyanka For Powerstar Pawan Kalyan?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ