యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత సినిమాల్లో మరీ లావుగా భయంకరంగా ఉండేవాడు. ఫుడ్ కంట్రోల్ ఉండదు, జిమ్ చెయ్యడు అనేది ఎన్టీఆర్ పై ఫాన్స్ కి ఫిర్యాదు ఉండేది. కానీ యమదొంగ ఎన్టీఆర్ లైఫ్ ని టర్న్ చేసింది. అప్పటినుండి ఎన్టీఆర్ బరువు తగ్గి స్లిమ్ లుక్ లోనే కనిపించినా.. అప్పుడప్పుడు ఎన్టీఆర్ కొద్దిగా బరువు పెరిగి కనిపిస్తే ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆందోళన మొదలైపోయేది. ఈమధ్యన ఆర్.ఆర్.ఆర్ కోసం పెంచిన బరువు తగ్గించేందుకు ఎన్టీఆర్ చాలానే కష్టపడ్డాడు.
ఆయన కొద్దిగా బరువు పెరిగినా హైట్ తక్కువ కావడంతో మరింత లావుగా కనిపించేవారు. చాలారోజులుగా స్టైలిష్ మేకోవర్ లోనే ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం కొరటాలతో NTR30 షూట్ మొదలు పెట్టారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. ఈలోపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయ్యింది. హ్రితిక్ రోషన్ తో వార్ 2 అనౌన్సమెంట్, రీసెంట్ గా వెట్రి మారన్ తో ఎన్టీఆర్ మూవీ గురించి ఆ దర్శకుడు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈలోపు ఎన్టీఆర్ కొత్త లుక్ లీకై సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది.
ఎన్టీఆర్ ఆ లుక్ లో చాలా స్టైలిష్ గా హ్యాండ్ సమ్ గా కనిపించడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్ తో పండగ చేసుకుంటున్న ఫాన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ న్యూ లుక్ తో మరింత మురిసిపోతున్నారు. బ్లాక్ షర్ట్ తో.. చిన్నపాటి గెడ్డం, డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో ఎన్టీఆర్ న్యూ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.