Advertisementt

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో చరణ్-ఉపాసన

Wed 12th Apr 2023 10:53 AM
ram charan,upasana  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో చరణ్-ఉపాసన
Ram Charan and Upasana as they landed back in Hyderabad హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో చరణ్-ఉపాసన
Advertisement
Ads by CJ

గత పదిరోజులుగా రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనలు జాలి ట్రిప్ లో ఉన్నారు. తమ పెంపుడు కుక్కపిల్ల రైమ్ తో కలిసి దుబాయ్ వెళ్లిన ఈ జంటకు అక్కడ ఉపాసన సిస్టర్స్, ఫ్యామిలీ, ఇంకా ఫ్రెండ్స్ అంగరంగ వైభవంగా శ్రీమంతం చేసారు. ఓ వారం రోజుల పాటు దుబాయ్ బీచ్ లో ఎంజాయ్ చేసిన ఈ జంట.. అక్కడ నుండి నాలుగు రోజుల క్రితమే మాల్దీవుల ట్రిప్ కి వెళ్ళింది.

మాల్దీవుల్లో బోటు షికారు, బీచ్ అందాలను ఆస్వాదించిన చరణ్-ఉపాసనలు నిన్న మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. రైమ్ తో ఆడుకుంటూ రామ్ చరణ్, ఉపాసనలు ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ తో అభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. రామ్ చరణ్ తన భార్య ప్రెగ్నెంట్ గా ఉండడంతో.. ఎక్కువగా ఆమెతో గడపడానికి ఇలా జాలి ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇక ఈ ట్రిప్ ముగియడంతో చరణ్ మళ్ళీ ఓ 15 రోజుల పాటు గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటాడు. శంకర్ ఇండియన్ 2 షూటింగ్ తైవాన్ షెడ్యూల్ ముగించుకుని మళ్ళీ హైదరాబాద్ కి రాగానే చరణ్ గేమ్ ఛేంజర్ సెట్స్ లో జాయిన్ అవుతాడు.

Ram Charan and Upasana as they landed back in Hyderabad :

Ram Charan and Upasana as they landed back in Hyderabad from Maldives last night 

Tags:   RAM CHARAN, UPASANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ