Advertisementt

తల్లయినా తగ్గేదేలే అంటున్న కాజల్

Wed 12th Apr 2023 10:38 AM
kajal agarwal  తల్లయినా తగ్గేదేలే అంటున్న కాజల్
Kajal Agarwal new photoshoot goes viral తల్లయినా తగ్గేదేలే అంటున్న కాజల్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో భీభత్సమైన హడావిడి చేస్తుంది. పెళ్లి, పిల్లలు అంటూ రెండేళ్లపాటు కరోనా కాలాన్ని పర్సనల్ లైఫ్ తో కరిగించేసిన కాజల్ అగర్వాల్ బిడ్డ పుట్టాక మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఎంతగా జిమ్ చేసినా కాస్త బరువుగానే కనిపించిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు మరింత నాజూగ్గా తయారైంది. గ్లామర్ గా మారిపోయింది. ఇండియన్ 2 షూటింగ్, బాలయ్య NBK108 షూటింగ్ అంటూ బిజీ లైఫ్ ని గడిపేస్తుంది.మధ్య మధ్యలో పార్టీలు, సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో బిజీగా మారిపోయింది.

ఈమధ్యన జీ తెలుగు ఛానల్ స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఓ ప్రోగ్రాం కి అతిధిగా హాజరైన కాజల్ అగర్వాల్ బాడీ షేమింగ్ పై తనెలా ట్రోల్ కి గురయ్యిందో వివరించింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోట్స్ ని షేర్ చేసే కాజల్ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే గతంలో మాదిరిగా కాజల్ వన్నెతరగని అందంతో మెరిసిపోతుంది అంటారు. బిడ్డ పుట్టాక కూడా అంతే గ్లామర్ ని మెయింటింగ్ చేస్తూ బ్యూటిఫుల్ గా మారిపోయిన కాజల్ ని చూస్తే ఆమె అభిమానులు అయితే ముద్దొచ్చేస్తోంది అంటారు. 

ప్రస్తుతం వరస సినిమా షూటింగ్స్ తో చేతినిండా పనితో, ఖాళీ సమయాల్లో కొడుకుతో ఆడుకుంటూ కాజల్ క్రేజీగా దూసుకుపోవడమే కాదు.. పారితోషకం విషయంలోనూ తగ్గేదేలే అంటుంది. NBK108 కోసం కాజల్ షాకింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

Kajal Agarwal new photoshoot goes viral:

Kajal Agarwal latest glamour look

Tags:   KAJAL AGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ