Advertisementt

మాల్దీవుల్లో చరణ్-ఉపాసన ఎంజాయ్మెంట్

Tue 11th Apr 2023 05:56 PM
ram charan,upasana  మాల్దీవుల్లో చరణ్-ఉపాసన ఎంజాయ్మెంట్
Charan-upasana enjoyment in Maldives మాల్దీవుల్లో చరణ్-ఉపాసన ఎంజాయ్మెంట్
Advertisement
Ads by CJ

దుబాయ్ వెకేషన్స్ నుండి రామ్ చరణ్-ఉపాసనలు మాల్దీవులకు వెళ్లారు. దుబాయ్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఉపాసన సిస్టర్స్ తో గడిపిన వారు అక్కడ ఉపాసన సీమంతం వేడుకల్లో సందడి చేసారు. తర్వాత ఈ జంట ఇప్పుడు మాల్దీవుల్లో ఎంజాయ్ చెయ్యడానికి వెళ్ళింది. ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో రామ్ చరణ్ షూటింగ్స్ లేని సమయాలలో ఆమెతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. అక్కడ కొద్దిరోజులు వెకేషన్స్ ని ఎంజాయ్ చేశాకే వీరు హైదరాబాద్ కి తిరిగివస్తారని తెలుస్తుంది.

ప్రస్తుతం మాల్దీవుల్లో షిప్ లో షికారు చేస్తూ ఉన్న పిక్స్ ని రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఉపాసనతో కలిసి చరణ్ షిప్ లో ఉన్న పిక్ ఒకటి, మరొకటి.. బీచ్ ఒడ్డున చరణ్ స్టైలిష్ గా నించున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ పిక్స్ చూసిన మెగా ఫాన్స్.. అన్నా వదినని బాగా చూసుకో.. ఎంజాయ్ చెయ్యండి అంటూ మెసేజెస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఉపాసనకు ఏడో నెల. ఎప్పుడెప్పుడు తమ బిడ్డని చేతుల్లోకి తీసుకుందామా అని ఈ జంట, మెగా వారసుడు ఇంట్లోకి ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా అని మెగా ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. 

ఇక హైదరాబాద్ కి రాగానే రామ్ చరణ్ గేమ్ చెంజర్ షూటింగ్ లో బిజీ అవుతాడు. ఆ తర్వాత బుచ్చిబాబు తో RC16 షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

Charan-upasana enjoyment in Maldives:

Ram Charan Enjoys A Ferry Ride With Wife Upasana

Tags:   RAM CHARAN, UPASANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ