సెలబ్రిటీస్ పిల్లలు ఏం చేసినా పబ్లిక్ లో వాళ్ళకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకే చాలామంది స్టార్ కిడ్స్ ని ఎక్కువగా బయటకనిపించనివ్వరు. ఎన్టీఆర్ తన పిల్లలని పెద్దగా పబ్లిక్ లో ఫోకస్ అవ్వనివ్వడు. మహేష్ మాత్రం తన పిల్లలు సితార, గౌతమ్ లతో తరుచూ అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తాడు. అల్లు అర్జున్ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో, పబ్లిక్ పార్టీలో తన పిల్లలతో కలిసి కనిపిస్తాడు.
అయితే మహేష్ బాబు గౌతమ్ ని తన 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెరకి పరిచయం చేసాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హ ని పాన్ ఇండియా ఫిలిం శాకుంతలంతో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇప్పించాడు. అర్హకి మాటలు కూడా రావు.. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని బన్నీ అన్నా గుణశేఖర్ పట్టుబట్టి బుల్లి భరతుడి పాత్రకి అర్హని తీసుకొచ్చారు.
ఇప్పటికే శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత అర్హ ని తెగ పొగుడుతోంది. అర్హ తెలుగు మాట్లాడే విధానానికి ప్రతి ఒక్కరూ ముగ్దులవుతున్నారు. ఇప్పుడు శాకుంతలం ప్రీమియర్స్ చూసాక.. అల్లు అర్జున్ కి పర్ఫెక్ట్ వారసురాలు దిగింది అంటున్నారు. ఏప్రిల్ 14 న విడుదల కాబోతున్న శాకుంతలం ప్రీమియర్స్ 4 రోజుల ముందే మొదలయ్యాయి. హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐ మాక్స్ లో శాకుంతలం ప్రీమియర్స్ సోమవారం నైట్ నిర్వహించారు. ఈ షో చూసిన వారు అర్హ నటనని పొగుడుతున్నారు. అర్హ కనిపించేది కొద్దిసేపే అయినా.. అద్భుతం అన్న రీతిలో మెప్పించింది, శకుంతల కొడుకు భరతుడిగా నటించిన అర్హ.. దేవ్ మోహన్ కి ధీటుగా పలికే డైలాగ్స్ కేక పెట్టించాయట.
అర్హ క్యూట్ గా డైలాగ్స్ చెబుతుంటే అందరూ అలా చూస్తుండిపోయారట. ఇంత చిన్న వయసులో అర్హ అలా కెమెరా ముందు ఉండి డైలాగ్స్ చెప్పడం చూస్తే.. నిజంగా సినిమా వారసులంటే ఇంతే కదా అనిపించిందట. అల్లు అర్జున్ వైఫ్ స్నేహ ఎప్పటికప్పుడు ఇలా కెమెరాల ముందు అర్హని నిలబెట్టబట్టే.. అర్హ ఏ బెరుకు లేకుండా అన్ని కెమెరాల ముందు నటించేసింది అంటున్నారు. ఇంత పొగడ్తలు కూతురు అర్హకి దక్కుతుంటే అల్లు అర్జున్ ఎంతగా పొంగిపోతున్నాడో కదా.