ఏ స్టార్స్ అయినా పర్సనల్ గా ప్రముఖుల మధ్యలో పార్టీలు చేసుకుంటే పిలిచినవారు తప్పకుండా హాజరవుతారు. అదే సన్మానాలు, మరేదన్నా ఈవెంట్స్ కి రావడానికి వెనుకాముందు తెగ ఆలోచించేస్తారు. అంతెందుకు ఆస్కార్ విజేతలైన కీరవాణి, చంద్రబోస్ లకు టాలీవుడ్ ప్రముఖులు సన్మానం చేసారు. కానీ అందులో రాజమౌళి ఫ్యామిలీ, దిల్ రాజు, సురేష్ బాబు, అరవింద్, రానా తప్ప ఒక్క స్టార్ కూడా కనిపించలేదు. కనీసం రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా రాలేదు. చరణ్ అంటే ఊళ్ళో లేదు. కానీ ఎన్టీఆర్ కి ఏమైంది.
అంటే ఆస్కార్ పార్టీ ఇస్తే మాత్రం అందరూ వెళ్ళిపోతారు. అదే రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి చూడండి నాగార్జున, కుర్ర హీరోలు అందరూ వచ్చేసారు. మరి ఆస్కార్ విన్నర్స్ ని సన్మాన వేడుకకి కనీసం మెగాస్టార్ కూడా రాకపోవడం పలు విమర్శలకు దారి తీసింది. టాలీవుడ్ కి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందించిన వారికి ఈ సన్మానం సరిపోతుందా.. అసలు తెలంగాణ, ఏపీ సీఎం లు కూడా వీళ్ళని పిలిచి కనీసం సన్మానించలేదు. ఇదంతా ఓకె.. ఆస్కార్ విన్నర్స్ ని పిలిచినప్పుడు ఆ సినిమాని నిర్మించిన నిర్మాతని మరిచిపోవడం మరో వింత.
ఆస్కార్ తెచ్చిన నెలకిగాని ఈ సన్మానానికి పెద్దలకి సమయం చిక్కలేదు. ఏదో వచ్చామా, ముగించామా అన్నట్టుగా ఈవెంట్ ని మమ అనిపించారు. అదే పార్టీ అయితే.. అబ్బో పది రోజులు చెప్పుకున్నా తరగని విధంగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ ఇదేమిటో.. ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ ని మన స్టార్స్ లైట్ తీసుకోవడమే అర్ధం కానీ విషయమంటూ నెటిజెన్స్ ఒకటే కామెంట్స్ చేస్తున్నారు.