Advertisementt

ఉస్తాద్ సెట్స్ లో శ్రీలీల

Tue 11th Apr 2023 10:00 AM
sreeleela,ustaad bhagat singh  ఉస్తాద్ సెట్స్ లో శ్రీలీల
Sreeleela in Ustad Bhagat Singh sets ఉస్తాద్ సెట్స్ లో శ్రీలీల
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో ఎన్నో అంచనాలు మధ్యన ఎంతో ఆలస్యంగా అంటే ప్రాజెక్ట్ ప్రకటించిన మూడేళ్ళకి ఏప్రిల్ 5 నుండి పట్టాలెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో జరుగుతుంది. ఈ సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ లుంగీ  కాస్ట్యూమ్స్ లో ఉన్న పిక్ లీక్ కాగా.. అది బాగా వైరల్ అయ్యింది. 

ఈ చిత్రంలో పూజ హేగ్డ్ నా, లేదంటే శ్రీలీల ఈ ఇద్దరిలో ఎవరు పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేస్తారో అనే విషయంలో ముందుగా శ్రీలీల ఉస్తాద్ సెట్స్ లోకి ఎంటర్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు నుండే శ్రీలీల అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో పాల్గొన్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక మరో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తున్నారో అనేది క్లారిటీ లేదు. ఈ  చిత్రంలో పవన్ కళ్యాణ్ తో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో శ్రీలీల ఒకటి.

ఈ చిత్రం విజయ్ తేరి చిత్రానికి రీమేక్ అని ప్రచారం జరుగుతున్నా ఈ విషయమై హరీష్ శంకర్ ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు. రీసెంట్ గ మొదలైన మొదటి షెడ్యూల్ ఈనెల 15 వరకు జరగనుంది.

Sreeleela in Ustad Bhagat Singh sets:

Sreeleela joins Ustaad Bhagat Singh shoot

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ