Advertisementt

ఆదిపురుష్ రాముడు కూడా కాపీ అంట

Mon 10th Apr 2023 07:47 PM
adipurush  ఆదిపురుష్ రాముడు కూడా కాపీ అంట
Copy allegations on Adipurush ఆదిపురుష్ రాముడు కూడా కాపీ అంట
Advertisement
Ads by CJ

ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఇవ్వకుండా ఓమ్ రౌత్ ఊరించి ఊరించి ఒక్కసారిగా టీజర్ వదిలారో.. లేదో.. ఆదిపురుష్ టీజర్ పై వచ్చినన్ని ట్రోల్స్ ఈమధ్య కాలంలో ఏ టీజర్ పైనా రాలేదు. ఆదిపురుష్ టీజర్ పై అభ్యంతరాలు, అలాగే శ్రీరామనవమికి రాముడితో సీతా సమేత లక్షణ, ఆంజనేయుడు పోస్టర్ వదిలితే.. దానిపై అభ్యంతరాలు. ముంబై కి చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఆ పోస్టర్ పై కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఇదంతా చూసినవారు ప్రభాస్ ఆదిపురుష్ విడుదల సమయానికి ఇంకెన్ని వివాదాలు తలెత్తుతాయో అనుకున్నారు.

తాజాగా శ్రీరామనవమి ఆదిపురుష్ పోస్టర్ పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆదిపురుష్ లో రాముడి డిజైన్ ని నా ఆర్ట్ నుండి కాపీ చేసారు.. నా ఆర్ట్ లోని రాముడిని చూసి వీరు ఆదిపురుష్ ప్రభాస్ ని రాముడిగా డిజైన్ చేసారు అంటూ ప్రతీక్ సంఘర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన ఆర్ట్ రాముడి స్క్రీన్ షార్ట్స్ ని షేర్ చేస్తూ.. నా అనుమతి లేకుండా నా ఆర్ట్ ని ఆదిపురుష్ ఆర్టిస్ట్ ఎలా వినియోగిస్తారంటూ ప్రతీక్.. ప్రశ్నిస్తున్నాడు.

తానొక ఇండియన్ ఆర్టిస్ట్ ని, రామాయణ ఇతిహాసాల్లోని రాముడి రూపం కోసం నా అన్వేషణ మొదలు పెట్టాను. ఇది ఒక ఏడాది క్రితమే జరిగింది. నా అనుమతి లేకుండా నా శ్రీరాముని రూపాన్ని ప్రదర్శించారు. ఆ సినిమా ప్రాజెక్ట్ వైఫల్యానికి ఇదో కారణం. ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళకి ప్రేమ, అభిమానం లేవు.  అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. నేను ఆల్రెడీ స్క్రీన్ షార్ట్స్ తీసాను.. అంటూ ఆదిపురుష్ మేకర్స్ పై ప్రతీక్ చిందులు వేస్తున్నాడు.

మరి ఒక్క పోస్టర్ కే ఇన్నిరకాల అభ్యంతరాలు ఎదురైతే.. అసలు సినిమా చూసాక ఇంకెన్ని అభ్యంతరాలు మొలకెత్తుతాయో అని ప్రభాస్ ఫాన్స్ తల పట్టుకుంటున్నారు. 

Copy allegations on Adipurush:

Did AdiPurush makers really plagiarise?

Tags:   ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ