Advertisementt

ప్రాజెక్ట్ K ఫ్రమ్ స్క్రాచ్ వీడియో

Mon 10th Apr 2023 01:44 PM
project k  ప్రాజెక్ట్ K ఫ్రమ్ స్క్రాచ్ వీడియో
Project K Assembled The Raiders ప్రాజెక్ట్ K ఫ్రమ్ స్క్రాచ్ వీడియో
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మహానటి నాగ్ అశ్విన్ కాంబోలో వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. ఈ చిత్రాన్ని జనవరి 12 న సంక్రాంతికి రిలీజ్ చెయ్యనున్నట్లుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ లో ఉన్నప్పటికీ.. విఎఫెక్స్ వర్క్స్ కి ఎక్కువ సమయం కావాలని సినిమాని నెక్స్ట్ ఇయర్ కి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. అమితాబ్ కీ రోల్ పోషిస్తున్నారు. అలాగే దిశా పటాని మరో హీరోయిన్ గా కనిపించబోతుంది.  

సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబందించిన ఓ టైర్ ని రెడీ చేసే ప్రాసెస్ లో ఎపిసోడ్ వన్- చక్రాన్ని తిరిగి కనిపెట్టడం అంటూ ప్రత్యేకంగా రూపొందించిన చక్రం యొక్క తయారీని చూపించింది. ఈరోజు ప్రాజెక్ట్ K నుండి మరో వీడియో రిలీజ్ చేసారు. ఎపిసోడ్ 2- అసెంబ్లింగ్ ది రైడర్స్‌ని విడుదల చేసారు. రైడర్స్ ఎవరు? చర్చల తరువాత వారు విలన్ యొక్క యూనిఫాం ఎలా రెడీ చేసారు. ఇది సినిమాలో అత్యంత కాస్ట్లీ ఎపిసోడ్ అంటూ ఆ వీడియోలో చూపించారు. 

నాగ అశ్విన్, ఇంకా ప్రాజెక్ట్ K కి పని చేస్తున్న టెక్నీషన్స్ తో ఈ వీడియోని రూపోంచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. టెక్నికల్‌గా ఈ సినిమా ఏ లెవల్‌ లో ఉండబోతోంది అనేది ఈ వీడియోస్ చూస్తే తెలుస్తుంది.

Project K Assembled The Raiders:

Another Interesting Video From Project K Is Out

Tags:   PROJECT K
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ