మెగా డాటర్స్ విడాకుల విషయంలో నెటిజెన్స్ ఆసక్తి చూపించడం అటుంచి.. వారు చేసే ప్రతి పని అందరిలో నిజంగానే ఆసక్తిని క్రియేట్ చేసింది. మొన్నటికి మొన్న శ్రీజ కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చేసింది. ఆ విషయం బయటపెట్టకపోయినా.. సోషల్ మీడియాలో పేర్లు మార్చెయ్యడం, ఫోటోలు డిలేట్ చెయ్యడంతో అది కన్ ఫర్మ్ అయ్యింది. మరోపక్క నాగబాబు కూతురు నిహారిక అదే బాటలో నడుస్తుంది అనిపించేలా ఆవిడ భర్త చైతన్య తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి నిహారికతో పెళ్లి ఫొటోస్, ఆమెతో వెకేషన్స్ కి తిరిగిన ఫొటోస్ డిలేట్ చేసాడు.
ఆ తర్వాత నాగబాబు, వరుణ్ తేజ్ లు చైతన్యని అన్ ఫాలో అయ్యారు. ఇక నిహారిక ఇప్పటివరకు తన సోషల్ మీడియా ఖాతాల నుండి చైతన్యతో జరిగిన పెళ్లి ఫొటోస్ డిలేట్ చెయ్యకపోయినా.. తాజాగా నిహారిక కూడా చైతన్య తో పెళ్లి ఫొటోస్, వెకేషన్స్ ఫొటోస్ ని డిలేట్ చేసి విడాకుల న్యూస్ కి ఊతమిచ్చింది. అయితే అన్ని ఫొటోస్ డిలేట్ చేసినా ఆమె తల్లి చీరతో పెళ్లి కుమార్తె గా రెడీ అయిన పిక్ మాత్రం డిలేట్ చెయ్యకుండా ఉంచేసింది. మరి ఆ ఫొటోతో ఏం చెప్పాలనుకుందో నిహారిక తెలియదు కానీ.. నిహారికకి ఆమె భర్త కి తెగతెంపులు అయ్యాయనేది వాస్తవమంటున్నారు నెటిజెన్స్.
ఈ విషయమై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి స్పందన లేదు, అసలు మెగా డాటర్స్ విడాకుల విషయంలో మెగాస్టార్ ఏం చేయలేకపోతున్నారా అనేది మెగా ఫాన్స్ ని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న.