పవన్ కళ్యాణ్ కొద్దిరోజులు రాజకీయాలంటూ సినిమాలకు బ్రేక్ తీసుకుని మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడమే హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ ని తెలుగులో వకీల్ సాబ్ గా రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఆ చిత్రం తర్వాత పవన్ వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ తో ఐకాన్ చేస్తారని అనుకున్నారు. అల్లు అర్జున్-వేణు శ్రీరామ్ ఐకాన్ అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. కానీ ఆ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ కనిపించకపోవడంతో వేణు శ్రీరామ్ అప్పటినుండి ఖాళీగా ఉండిపోయారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సీక్వెల్ కి సన్నాహాలు మొదలు పెట్టారట.
వకీల్ సాబ్ విడుదలై రెండేళ్లు పూర్తవడంతో.. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పవన్ కళ్యణ్ రీ ఎంట్రీ సినిమా, హిట్ వకీల్ సాబ్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసారు. వకీల్ సాబ్ సాధించిన సక్సెస్ ను వేణు శ్రీరామ్ గుర్తు చేసుకుంటూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతుంది అని హింట్ ఇవ్వడమే కాదు.. ప్రస్తుతం అందుకు సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్లుగా చెప్పి పవన్ ఫాన్స్ ని అలెర్ట్ చేసారు.
త్వరలోనే వకీల్ సాబ్ 2 కి సంబందించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పడంతో పవన్ ఫాన్స్ ఖుషీగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం పవన్ లైనప్ చూస్తే వకీల్ సాబ్ 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఈలోపు వేణు శ్రీరామ్ మరేదన్నా హీరోతో సినిమా చేస్తారేమో చూడాలి.