Advertisementt

పుష్ప టార్గెట్ అదే

Mon 10th Apr 2023 10:28 AM
pushpa 2  పుష్ప టార్గెట్ అదే
Pushpa making a big target on North పుష్ప టార్గెట్ అదే
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ద రైజ్ చిత్రాన్ని పాన్ ఇండియా మర్కెట్ లో విడుదల చేస్తున్నామని చెప్పి.. ప్రమోషన్స్ హడావిడిగా నిర్వహించినా.. ఆ చిత్రం హిందీలో బాగా వర్కౌట్ అయ్యింది. కేవలం ఒకే ఒక ప్రెస్ మీట్ తో పుష్ప చిత్రం బాలీవుడ్ లో 100 కోట్లకి పైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. నిజంగా అల్లు అర్జున్ స్టామినా పుష్ప తో హిందీలో ప్రూవ్ అయ్యింది. అందుకే ఈసారి సుకుమార్ ఎక్కువగా పుష్ప ద రూల్ ని నార్త్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా స్కెచ్ వేసారట. 

నార్త్ ఆడియన్స్ నుండి కోట్లాది కలెక్షన్స్ కొల్లగొట్టే ప్లాన్ జరిగిపోయిందట. అందులో భాగమే.. పుష్ప ద రూల్ స్పెషల్ వీడియో అంటున్నారు. పుష్ప ద రూల్ వీడియో అల్లు అర్జున్ బర్త్ డే రోజున విడుదలవగా.. ఈ వీడియో కి మిగతా లాంగ్వేజెస్ ముఖ్యంగా తెలుగులో క్రేజ్ ఎక్కువగా ఉన్నా.. ఈ వీడియోకి ఎక్కువ హిందీలోనే రికార్డ్ వ్యూస్ రావడం దానికి నిదర్శనమంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ తరచూ ముంబై వెళ్ళేది.. పుష్ప ద రూల్ ప్రమోషన్స్ అప్పుడు అక్కడి ప్రముఖులతో సినిమాపై హైప్ క్రియేట్ చేసే ప్లాన్స్ లో భాగంగానే అల్లు అర్జున్ తరచూ ముంబై వెళుతున్నట్లుగా తెలుస్తుంది.

ఈసారి పక్కా ప్లానింగ్ ప్రమోషన్స్ తోనే పుష్పని విడుదల చెయ్యాలని సుక్కు-బన్నీ ఎప్పుడో డిసైడ్ అయ్యారు. ముంబైలో వీలైనంత టైమ్ స్పెండ్ చేసి పుష్పపై క్రేజ్ పెంచేలా అల్లు అర్జున్ ఇప్పటికే అక్కడ పిఆర్ టీమ్ ని మెయింటింగ్ చేస్తున్నాడట. ప్రస్తుతం పుష్ప వీడియోకి నార్త్ నుండి వస్తున్న ఆదరణతో సినిమాపై అక్కడ క్రేజ్, హైప్ ఎలా ఉందో మేకర్స్ కూడా ఓ అంచనాకి వచ్చేసినట్లుగా తెలుస్తుంది. 

Pushpa making a big target on North:

Biggest Target Already Set For Pushpa 2

Tags:   PUSHPA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ