ఇప్పుడు NTR30 పై వినిపిస్తున్న న్యూస్ చూస్తే క్రేజీ సంగతి ఏమో కానీ.. ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒకప్పటి పూరి-ఎన్టీఆర్ ల ఆంద్రావాలా గుర్తొచ్చి గజగజా వణికిపోతున్నారు. గతంలో పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ అది కూడా తండ్రి కొడుకులుగా నటించిన ఆంద్రావాలా అట్టర్ ప్లాప్ అయ్యింది. అప్పట్లో పూరికి, ఎన్టీఆర్ కి ఈ సినిమా చాలా డ్యామేజ్ అయ్యింది. ఇప్పుడు మరోసారి కొరటాల శివ ఎన్టీఆర్ ని డ్యూల్ రోల్ లో అందులోను తండ్రీకొడుకులుగా చూపించబోతున్నారనే న్యూస్ చూసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి వెన్నులో ఒణుకు వచ్చేస్తుంది.
రీసెంట్ గా మొదలైన NTR30 రెగ్యులర్ షూటింగ్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ గోవా కి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. సముద్ర తీర నేపథ్యంలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. ఆ మృగాళ్లకు భయమంటే ఏంటో తెలియదు. దేవుడంటే.. చావంటే భయం లేదు. కానీ వారందరికీ ఉండే ఒకే ఒక భయం ఉంటుంది. అదేంటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అంటూ NTR30 ఓపెనింగ్ రోజునే కొరటాల శివ అందరిలో ఆశక్తిని క్రియేట్ చేసినట్టుగా..ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. అది కూడా తండ్రీ కొడుకులుగా కనిపిస్తారని.. ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రీ పాత్ర కనిపిస్తుంది అంటూ వినిపిస్తున్న న్యూస్ తోనే ఎన్టీఆర్ ఫాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. అయితే కొరటాల మేకింగ్ పై భయమక్కర్లేదు.. ఈ చిత్రంతో ఎలాగైనా ఎన్టీఆర్ గట్టిగా పాన్ ఇండియాని షేక్ చెయ్యడం ఖాయమని కొంతమంది బలంగా నమ్ముతున్నారు.