ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో సమంత పాన్ ఇండియా స్టార్ అయ్యింది. సమంతని నమ్ముకుని తెలుగు దర్శకులు పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. మొన్న యశోద, ఇప్పుడు శాకుంతలం. శాకుంతలం ఏప్రిల్ 14 న విడుదలకు రెడీ అయ్యింది. టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. ఇక్కడ సమంత పర్సనల్ విషయాలను పట్టించుకుంటున్న జనాలు శాకుంతలంని ఎంత ఆదరిస్తారో అర్ధం కావడం లేదు.
సమంత కన్నీటి కథకి తెలుగు ప్రేక్షకులులు కనెక్ట్ అయినా.. మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలని లేదు. అసలు వీరు చేసే ప్రమోషన్స్ ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఇంట్రెస్ట్ ని తీసుకొస్తాయో.. ఇక్కడ సమంత తప్ప మరో స్టార్ లేరు. దుశ్యంత్ కేరెక్టర్ కి ఏ రాణానో తీసుకుంటే బావుండేది అని కొంతమంది ఫీలింగ్. దేవ్ మోహన్ సరిపొడేమో అంటున్నారు. కేవలం సమంత ని చూసి సినిమాకి రారు. ఆ సినిమాపై ఏంతో కొంత ఇంట్రెస్ట్ కనిపించాలి. కానీ ఎటు చూసినా శాకుంతలంపై బజ్ కనిపించడమే లేదు.
వాళ్ళేదో ప్రమోషన్స్ తో కష్టపడుతున్నవేళ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో ఏదో గోల అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు.. దిల్ రాజు హెల్పింగ్ హ్యాండ్ ఎంతవరకు పని చేస్తుందో తెలియదు. ఆయన లాభం లేకుండా ఏ పని చెయ్యడు. సమంత క్రేజ్ పాన్ ఇండియా కి సరిపోతుందా? ఇవన్నీ చూస్తుంటే శాకుంతలం విడుదలై దానికి హిట్ టాక్ వస్తేనే కానీ.. లేదంటే ఈ సినిమాతో గుణశేఖర్ బ్యాచ్ పని ఫినిష్ అంటున్నారు.