యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఆయన్ని టీజ్ చేస్తూ చేసిన ట్వీట్స్ కి బన్నీ కూడా రిప్లైలు ఇవ్వడం అల్లు-ఎన్టీఆర్ ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసాయి. వీరిమధ్యన ఇంత బాండింగ్ ఉందా అని మిగతా హీరోలు అభిమానులు ఆశ్చర్యపోతే.. రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం కుళ్ళుకుంటున్నారట. రామ్ చరణ్ బర్త్ డే కి జస్ట్ ట్వీట్ మాత్రమే చేసి, పార్టీకి హాజరవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఇలాంటి ఫన్నీ ట్వీట్స్ పెట్టడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
అటు అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ బర్త్ డే కి విషెస్ చెప్పకుండా, పార్టీకి హాజరవకుండా తప్పించుకున్నాడు. పోనీ వెకేషన్స్ కి వెళితే వెళ్ళాడు, సోషల్ మీడియాలో చరణ్ బర్త్ డే రోజున ఓ ట్వీట్ వేస్తె పోయేది. కానీ అల్లు అర్జున్ అది కూడా చెయ్యలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఇలా సోషల్ మీడియాలో బావా, బావ అంటూ ఫన్నీ రిప్లైస్ ఇస్తూ చరణ్ ని అవమానించావంటూ మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై మండిపడిపోతున్నారట.
ఎన్టీఆర్ ని బావా అంటూ సంబోధించడం, చరణ్ ని అల్లు అర్జున్ లైట్ తీసుకోవడం పట్ల ఓ పక్క కోపం, ఓ పక్క అల్లు అర్జున్-ఎన్టీఆర్ బంధంపై వాళ్ళకి కుళ్ళు వచ్చేస్తుందట.