రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో క్రేజీ ప్రమోషన్స్ తో రావణాసురుని విడుదల చేసాడు. ధమాకా, వాల్తేర్ వీరయ్యలు సక్సెస్ తో రావణాసురుని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం అటుంచి.. మొదటిరోజు పూర్ ఓపెనింగ్స్ రావడం మేకర్స్ కి షాకిచ్చాయి. ధమాకా, వాల్తేర్ వీరయ్యలు మంచి హిట్ అయ్యాయి, ఆ ఊపుతో రావణాసుర ఓపెనింగ్స్ అదిరిపోతాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రవితేజ అట్టర్ ప్లాప్ మూవీ ఖిలాడీ మొదటిరోజు 6.8 కోట్లు తెచ్చుకుంటే, మరో అట్టర్ ప్లాప్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ 6.3 కోట్లు, ధమాకా చిత్రం ఏకంగా 9.45 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ రావణాసుర రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.30 కోట్ల షేర్ తెచ్చుకుంటే.. ప్రపంచ వ్యాప్తంగా 4.90 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఏరియా మొదటిరోజు కలెక్షన్స్
నైజాం 1.64 కోట్లు
సీడెడ్ 0.70
ఉత్తరాంధ్ర 0.61
ఈస్ట్ 0.30
వెస్ట్ 0.21
గుంటూరు 0.45
కృష్ణా 0.23
నెల్లూరు 0.15
తెలుగు రాష్ట్రాల్లో 4.30 కోట్ల షేర్, 6.75 కోట్ల గ్రాస్
కర్ణాటకలో 0.26
ఓవర్సీస్ 0.30
ప్రపంచవ్యాప్తంగా 4.90 కోట్ల షేర్, 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.