అఖిల్ అక్కినేని లవర్ బాయ్ నుండి మాస్ అవతార్ లో ఏజెంట్ లుక్ లోకి రావడానికి చాలానే కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీని మెయింటింగ్ చెయ్యడానికి రెండేళ్లుగా జిమ్ లో వర్కౌట్స్, డైట్ ఫాలో అవుతూ చమటలు చిందిస్తున్నాడు. ఏజెంట్ గా ఆ సిక్స్ ప్యాక్ బాడీలోకి మారేందుకు ఏకంగా అఖిల్ కి ఏడాది సమయం పట్టిందట. ఆ మేకోవర్ అవడానికి ఏడాది, సినిమా కోసం ఏడాదిన్నర పెట్టినట్లుగా అఖిల్ చెబుతున్నాడు. అయితే ఈరోజు పుట్టిన రోజు స్పెషల్ గా సుమ ఇంటర్వ్యూలో అఖిల్ ఈ మేకోవర్ అవడానికి తన డైట్ ఏమిటనేది ఆ సీక్రెట్స్ అన్ని బయటపెట్టేసాడు.
ఇక సిక్స్ ప్యాక్ బాడీ కోసం రోజు ఉదయమే ఎగ్ వైట్స్ ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవాడిని, మధ్యాన్నం రైస్ అంటే.. విత్ అవుట్ ఆయిల్, విత్ అవుట్ మసాలా, సాల్ట్ లేకుండానే చికెన్ విత్ రైస్ తినేవాడిని, అలా సిక్స్ మంత్స్ అయితే గట్టిగా చేశాను అనగానే సుమ వామ్మో అంటూ అరిచేసింది, నో ఆయిల్, నో సాల్ట్ వామ్మో అనేసింది. అబ్బా నువ్ గ్రేట్ అఖిల్ అంది. నా బాడీ ఎలాంటిదంటే నేను జిమ్ కి వెళ్లకపోతే ఇక అంతే.. నా బాడీ లూజ్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా జిమ్ చెయ్యాలి.
కొన్నాళ్లుగా ఈ ఏజెంట్ లుక్ కోసం ఇదే డైట్ ఫాలో అయ్యాను, ఇప్పుడు అదే అలవాటైపోయింది.. అంటూ అఖిల్ తన డైట్ విషయం చెప్పి షాకిచ్చాడు. ఇక ఏజెంట్ అవుట్ అండ్ ఫుట్ స్పై థ్రిల్లర్.. అలాగే లవ్ స్టోరీ, కొద్దిగా రొమాన్స్ కూడా ఉంది అంటూ అఖిల్ ఏజెంట్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.