Advertisementt

ఎన్టీఆర్ ఫాన్స్ కి కొత్త భయాలు

Sat 08th Apr 2023 12:52 PM
ntr,ntr fans  ఎన్టీఆర్ ఫాన్స్ కి కొత్త భయాలు
New fears for NTR fans ఎన్టీఆర్ ఫాన్స్ కి కొత్త భయాలు
Advertisement
Ads by CJ

NTR30 అప్ డేట్ కోసం ఏడాదిగా వెయిట్ చేసిన ఎన్టీఆర్ ఫాన్స్ కి ఈమధ్యనే ఎన్టీఆర్ NTR30 పూజా కార్యక్రమాలు, అలాగే రెగ్యులర్ షూట్ కి వెళ్లి ఆనందాన్ని అందించాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ సెన్సేషనల్ కాంబోని సెట్ చేస్తూ హ్రితిక్ రోషన్ తో బాలీవుడ్ దర్శకుడు ఆయన్ ముఖర్జీతో సినిమా చెయ్యబోతున్నట్టుగా చెప్పి ఫాన్స్ కి స్వీట్ ట్రీట్ ఇచ్చాడు. బాలీవుడ్ హీరో హ్రితిక్-ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు. లేట్ చేస్తే చేసావ్ కానీ.. ఎన్టీఆర్ నీ లైనప్ సూపర్ అంటూ పొగుడుతున్నారు. 

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ లో కొత్త భయాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్ తో హ్రితిక్ రోషన్ వార్ 2 కాంబోని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్.. ఇప్పుడు ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ వేసాడేమో అనే మీమాంశలోకి వెళుతున్నారు. బాలీవుడ్ లో హ్రితిక్ తో కలిసి నటించడం డెఫ్నెట్ గా క్రేజీ విషయమే. కానీ హ్రితిక్ లాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న వ్యక్తితో ఎన్టీఆర్ కలిసి నటించడం అంటే.. ఎన్టీఆర్ హ్రితిక్ ముందు తేలిపోతాడేమో.. అసలు ఎన్టీఆర్ ఈ ప్రపోజల్ ని ఒప్పుకోకుండా ఉండాల్సిందేమో అని అనుకుంటున్నారు.

ఇక్కడ రామ్ చరణ్ తో కలిసి నటించినప్పుడు ఓకె.. ఎలాగో ఫిజిక్ పరంగా రఫ్ గా పెరఫార్మెన్స్ వైస్ గా  బాగానే హ్యాండిల్ చేసాడు. కానీ అక్కడ హ్రితిక్ రోషన్ లాంటి 6 అడుగుల హీరోతో నటించడం అంటే.. ఎన్టీఆర్ ఎక్కడ డౌన్ అవుతాడో, అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతుంటుందో.. అనేది ఇప్పుడు వాళ్ళలో మొదలైన భయానికి కారణం. ఎన్టీఆర్ హైట్ సరిపోదు, ఏదో పెరఫార్మెన్స్ తో మ్యానేజ్ చెయ్యడానికి కుదరదు, ఖచ్చితంగా హ్రితిక్ రోషన్ తో ఫేస్ టు ఫేస్ పోరాడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏ లాజిక్ తో ఎన్టీఆర్ ఒప్పుకున్నాడో కానీ.. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈ కాంబో ని తలచుకుని భయపడడం మొదలు పెట్టారు.

ఒకవేళ ఎన్టీఆర్-హ్రితిక్ కలిసి ఒకేసారి స్క్రీన్ మీద కనబడితే.. ఎన్టీఆర్ హ్రితిక్ ముందు అస్సలు కనిపించడు, ఆయాన్ ఏం చెప్పి ఒప్పించవయ్యా మా హీరోని అంటూ ఆయన్ ని మనసులోనే తిట్టుకుంటున్నారు వారు.

New fears for NTR fans:

The tension that started in NTR fans

Tags:   NTR, NTR FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ