Advertisementt

మరో కొత్త కాస్ట్యూమ్ లో జాన్వీ జాతర

Sat 08th Apr 2023 11:24 AM
janhvi kapoor  మరో కొత్త కాస్ట్యూమ్ లో జాన్వీ జాతర
Janhvi Kapoor Looks Gorgeous In Yellow Outfit మరో కొత్త కాస్ట్యూమ్ లో జాన్వీ జాతర
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో కొత్త కొత్త కాస్ట్యూమ్స్ తో ఫ్యాషన్ విషయంలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్న జాన్వీ కపూర్.. ఎల్లప్పుడూ కొత్తగా కనిపించాలనుకుంటుంది. మోడ్రెన్ వేర్, ఎత్నిక్ వేర్, ట్రెడిషనల్ వేర్ ఎందులోనైనా జాన్వీ కపూర్ కొత్తదనమే కోరుకుంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఓకె అయినప్పటికీ.. సోషల్ మీడియాలో తన స్పెషల్స్ చూపిస్తూనే ఉంది. గ్లామర్ చూపించే విషయంలో నన్ను ఫాలో అయిపోండి అనేలా ఉంటాయి ఆమె డ్రెస్సులు, లుక్స్ అన్ని.

రీసెంట్ గానే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ లో డిజైనర్ వేర్ డ్రెస్సులతో మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జాన్వీ కపూర్ కొత్త లుక్స్ ట్రై చేసే విషయంలో ఎక్కడా తగ్గదు. ఇప్పుడు ఎల్లో అవుట్ ఫిట్ లో మరోసారి ప్రత్యేకతని చూపించింది. రీసెంట్ గా బాలీవుడ్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కి ఇలా మోడ్రెన్ డ్రెస్సులో లూజ్ హెయిర్ తో కవ్వించే చూపులతో జాన్వీ కపూర్ హాజరైంది. ప్రస్తుతం జాన్వీ ఎల్లో అందాల గురించి చర్చించుకునేలా ఆ అవుట్ ఫిట్ ఉంది.

ఇక NTR30 షూట్ లో జాన్వీ ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదామా, ఎన్టీఆర్ తో కలిసి ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తానా అనే క్యూరియాసిటిలో జాన్వీ ఉండగా.. ఎన్టీఆర్ ఫాన్స్ కూడా జాన్వీ కపూర్ ని ఎన్టీఆర్ పక్కన ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అతృతతో కనిపిస్తున్నారు.

Janhvi Kapoor Looks Gorgeous In Yellow Outfit:

Janhvi Kapoor in Yellow dress at Pinkvilla Style Icons Awards 

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ