Advertisementt

అంచనాలు పెంచుతున్న ఏజెంట్

Sat 08th Apr 2023 10:31 AM
agent,akhil  అంచనాలు పెంచుతున్న ఏజెంట్
AGENT wishes Akhil Akkkineni a very Happy Birthday అంచనాలు పెంచుతున్న ఏజెంట్
Advertisement
Ads by CJ

నిన్నటివరకు ఏజెంట్ పై ఎన్నో అనుమానాలు, అసలు మరోసారి ఏజెంట్ విడుదల వాయిదా పడుద్దా అని. దానికి రకరకాల కారణాలున్నాయి. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా ఏజెంట్ మేకర్స్ కదలికలు కనిపించాయి. కానీ అఖిల్ బర్త్ డే సమయానికి అన్ని మార్చేశారు. అఖిల్ షూటింగ్ సెట్స్ లోనే సుమ తో ఇంటర్వ్యూ మొదలు పెట్టేసాడు. మరోపక్క అఖిల్ బర్త్ డే స్పెషల్ గా ఏజెంట్ నుండి పవర్ ఫుల్ పోస్టర్ వదిలారు.

యాక్షన్ సీన్స్ లో అఖిల్ లుక్ ని ఒక్కొక్కటిగా వదులుతూ సినిమాపై భీభత్సమైన అంచనాలు పెంచేశారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరోలని ఎలా చూపిస్తారో అందరికి తెలుసు. అందులో భాగమే అఖిల్ ఏజెంట్ లుక్స్ తోనే అక్కినేని ఫాన్స్ నే కాదు.. ఆడియన్స్ ని, మాస్ ఫాన్స్ ని ఇంప్రెస్స్ చేసారు. నిన్నటివరకు ఏజెంట్ పై ఎంత అంచనాలున్నాయో తెలియదు కానీ.. అఖిల్ బర్త్ డే రోజు వదిలిన పోస్టర్స్ తో మాత్రం అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఫ్యాబ్యులెస్ లుక్, అదరగొట్టేసిన అఖిల్, సిక్స్ ప్యాక్ లో ఏమున్నాడురా అని అఖిల్ ని పొగుడుతూ ఏజెంట్ కోసం వెయిటింగ్ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. ఏప్రిల్ 28 వరకు ఏజెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటామంటూ అఖిల్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

AGENT wishes Akhil Akkkineni a very Happy Birthday:

Agent: Akhil Birthday posters

Tags:   AGENT, AKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ