గత గురువారం శ్రీరామనవమి రోజున విడుదలై సెన్షనల్ హిట్ అయిన నాని దసరా వారం తిరిగే లోపే 100 కోట్ల మార్క్ ని అందుకుంది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలవబోతుంది. రెండో వారంలోకి ఎంటర్ అయినా ఇంకా ఇంకా దసరా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూనే ఉంది. దసరా ప్లాప్ అన్న నోళ్లే దసరా కొస్తున్న కలెక్షన్స్ ని పొగుడుతున్నాయి. నాని-కీర్తి సురేష్ కాంబోలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రా అండ్ రస్టిక్, తెలంగాణ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడంతో సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
ఇప్పుడు నానికి రెండో వారం కూడా కలిసొచ్చేలా కనబడుతుంది. అంటే ఈ వారం రవితేజ రావణాసుర, కిరణ్ అబ్బవరం మీటర్ మూవీస్ ఆడియన్స్ ముందుకి రాగా.. అందులో రవితేజ రావణాసురకి యావరేజ్ వచ్చింది,.. కిరణ్ అబ్బవరం మీటర్ ని తిట్టినవారే కానీ తిట్టని వారు లేదు. అట్టర్ ప్లాప్ మీటర్ అంటూ కిరణ్ మూవీని, ఆయన కథల ఎంపికని ఏకి పారేస్తున్నారు. ఇక రావణాసురకి కూడా హిట్ టాక్ రాలేదు.
మరి సినిమా ఫలితాలని బట్టి థియేటర్స్ కి వెళుతున్న ఆడియన్స్ ఏ సినిమాకి ఓటేస్తారు అనేది ఈమధ్య కాలంలో చాలానే చూసాం. అసలే ఇంటర్, 10th ఎగ్జామ్స్ కూడా పూర్తి కావోస్తుండడంతో.. స్టూడెంట్స్ అంతా ఎంటర్టైన్మెంట్ కోసం, ఛిల్ అవడానికి థియేటర్స్ మీద పడతారు. ఇప్పుడు మరోమారు దసరా థియేటర్స్ ఆక్యుపెన్సీ పెరిగేలా కనబడుతుంది. రావణాసుర టాక్, మీటర్ టాక్ వీక్ గా ఉండడం దసరాకి రెండో వారం హెల్ప్ అయ్యేలా ఉంది. చూద్దాం ఈ వారం దసరా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది.