చాలామంది సెలెబ్రిటీ జంటలు.. కలిసి కనిపించకపోయినా, లేదంటే వేరే ఏ విషయంలో అయినా వారిపై అనుమానం వస్తే చాలు.. ఆ సెలెబ్రిటీ జంటలు విడిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనడం చూస్తూనే ఉన్నాము. బాలీవుడ్ లో ఎప్పటినుండో ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ లు విడిపోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వారిద్దరూ కలిసి ఒక పార్టీకి హాజరవ్వకపోయినా.. ఐష్ తన కూతురితో సపరేట్ గా కనిపించినా.. ఇక అభిషేక్ తో ఐష్ విడిపోతుంది అంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చేస్తాయి. దానితో అభిమానులు కంగారు పడిపోతుంటారు.
కానీ మధ్యలో వాళ్ళు కలిసి ఏ ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే చాలు హమ్మయ్య అని అభిమానులు ఊపిరి పీల్చుకుంటారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఐశ్వరాయ్-అభిషేక్ బచ్చన్ ల విడాకుల వార్త రేజ్ అయ్యింది. కారణం ముంబైలో రీసెంట్ గా జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్ కి ఐష్ తన కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి హాజరైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ కి ఐష్ ఆమె కూతురు ఆరాధ్య మాత్రమే హాజరవడంతో.. అభిషేక్ ఈ ఈవెంట్ లో ఐష్ తో కలిసి కనిపించకపోవడంతో.. ఈ విడాకుల వార్తకి మరోసారి రెక్కలొచ్చాయి.
కొంతమంది నెటిజెన్స్ నిజంగానే ఐష్-అభిషేక్ మధ్యన ఏమైనా జరిగిందా.. వీరు విడిపోతారా అనే అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఈ క్యూట్, స్వీట్ కపుల్ కి ఎన్నిసార్లు విడాకులిస్తార్రా అంటూ ఆగ్రహమూ వ్యక్తం చేస్తున్నారు.