కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యి ఏడాదికి రెండు సినిమాలు చొప్పున రిలీజ్ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే టాప్ బ్యానెర్లతో చేతులు కలిపి బిజీగా మారిపోయాడు. అయితే తనకి బ్యాగ్రౌండ్ లేకపోవడం వలనే తనని ట్రోల్స్ చేస్తున్నారు, తనని ఇండస్ట్రీ నుండి పంపించెయ్యడానికి చాలామంది చూస్తున్నారు, దాని కోసం ఓ బ్యాచ్ తయారైంది అంటూ కిరణ్ అబ్బవరం ప్రతి సినిమా ప్రమోషన్స్ లో చెబుతూనే ఉన్నాడు. మీరెంతగా ప్రయత్నం చేసినా నేను వెళ్ళను ఇక్కడే ఇండస్ట్రీలో ఉంటానంటూ ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు.
అయితే ఫిబ్రవరిలో నేను మీకు బాగా కావల్సిన వాడిని సినిమాతో యావరేజ్ అందుకున్న కిరణ్ ఇప్పుడు మీటర్ తో మాస్ మూవీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. సినిమా
థియేటర్స్ లో మొదలైన పది నిమిషాలకే ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. అరగంట తిరక్కముందే థియేటర్స్ నుండి పారిపోతున్నారు. ఆ సినిమా చూసాక మీటర్ లో అస్సలు మేటర్ లేదు, అమ్మో ఇలాంటి సినిమా నా లైఫ్ లోనే ఎప్పుడూ చూడలేదు, మరీ ఇంత చెత్త సినిమా ఏమిట్రా బాబు, అసలు కిరణ్, మైత్రి వారికి ఈ కథ ఎలా నచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
దానితో కిరణ్ అబ్బవరానికి సలహాలు ఇచ్చేవారు ఎక్కువైయ్యారు. కిరణ్ పెద్ద బ్యానర్ లు దొరికాయి కదా అని ఏది బడితే అది చేస్తే.. ఇలానే ఉంటుంది, కథలు ఎంపికలో మెచ్యూరిటీ తెచ్చుకో. ముందు నటన నేర్చుకో.. మంచి కథలు ఎంచుకో.. ఇలాంటి మీటర్ లు చేశావంటే మర్కెట్ మొత్తం పడిపోతుంది.
తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ప్రయోజనం సూన్యం, ఇలాంటి సినిమా మరొక్కటి పడితే నువ్వు కోలుకోవడం కూడా కష్టమే. చూసుకో.. సరిగ్గా కథల మీద దృష్టి పెట్టు అప్పుడే హీరోగా నాని స్టేజ్ కి చేరుతావ్ అంటూ సోషల్ మీడియా వేదికగా కిరణ్ అబ్బవరానికి సలహాలు ఇస్తున్నారు.