ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ ని తాకింది. గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ స్ట్రయిట్ మూవీస్ చేసేందుకు సిద్దమైపోయాడు. క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నాడు. సెన్సేషనల్ కాంబోతో ఊహించని ట్రెండ్ సృష్టిస్తున్నాడు. కొరటాల శివ తో NTR30 ని రీసెంట్ గానే స్టార్ట్ చేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో మరో పాన్ ఇండియా మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు. తర్వాత వెంట్రి మారన్ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుంది అనుకుంటే.. ఎవ్వరూ ఊహించని కాంబోని తెరపైకి తీసుకువచ్చాడు.
అదే బాలీవుడ్ ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ తో చెయ్యి కలుపుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత క్రేజీ స్టార్ గా మారిన ఎన్టీఆర్ కొరటాల శివ-ప్రశాంత్ నీల్ మూవీస్ కి 100 కోట్ల పారితోషకం తీసుకోబోతున్నాడనే న్యూస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. ఆ రెండు సినిమాలకి ఎన్టీఆర్ కి 100 కోట్ల పారితోషకాన్ని నిర్మాతలు తెగ్గొట్టారట. అదలాఉంటే.. హ్రితిక్ రోషన్ తో చెయ్యబోయే మూవీకి ఎన్టీఆర్ పారితోషకంపై ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది.
వార్ 2 లో ఎన్టీఆర్ విలనా లేదా హీరోనా అనే కన్ఫ్యూజన్ లోనే ఉన్న ఆయన ఫాన్స్ ఇప్పుడు ఎన్టీఆర్ పారితోషకం విషయంలో గూగుల్ ని తెగ వెతికేస్తున్నారు. అయితే వార్ 2లో తన పాత్ర కోసం ఎన్టీఆర్ 30 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పారితోషకం లెక్కలేస్తే ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉండనుందని స్పష్టమవుతోంది. ఏదేమైనా సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 5 స్టార్లలో ఒకడిగా ఎన్టీఆర్ నిలిచాడంటూ ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.