అఖిల్ ఏజెంట్ అసలు ఏప్రిల్ 28 కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అవి చూసిన అక్కినేని ఫాన్స్ ఆందోళన పడిపోతున్నారు. కారణం.. ఇప్పటికే ఏజెంట్ పలుమార్లు విడుదల తేదీలు మార్చుకుంది.. ఇప్పుడేమో మరోసారి తేదీ మరే ఛాన్స్ ఉంది అంటున్నారు.. దీనితో సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉంది అంటూ వారు కంగారుపడుతున్నారు.
అయితే ఇంకా 20 రోజుల షూట్ మిగిలి ఉంది.. విడుదలకు 22 రోజులే సమయం ఉంది అంటూ వార్తలు చూసిన ఏజెంట్ మేకర్స్ ఒక్కసారిగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. అఖిల్ తో సుమ ఇంటర్వూస్ జరుగుతున్నట్టుగా అప్ డేట్స్ ఇవ్వడం, హ్యాపీ హనుమాన్ జయంతి.. ప్రమోషన్స్ షురూ అంటూ అనిల్ సుంకర అప్ డేట్ ఇవ్వడం, ఇక ఈరోజు అఖిల్ బర్త్ డే ఏప్రిల్ 8 న స్పెషల్ గా ఏజెంట్ నుండి స్పెషల్ ట్రీట్ రాబోతున్నట్టుగా పోస్టర్ తో సహా ప్రకటించారు.
అంతేకాకుండా ఏజెంట్ ఖచ్చితంగా ఏప్రిల్ 28 నే రిలీజ్ అంటూ పవర్ ఫుల్ పోస్టర్ తో మరోసారి కన్ ఫర్మ్ చేసారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.