Advertisementt

ఈటీవిలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్

Thu 06th Apr 2023 10:50 PM
sudigali sudheer,sridevi drama company  ఈటీవిలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్
Sudigali Sudheer re-enters ETV ఈటీవిలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్
Advertisement
Ads by CJ

గత కొన్నాళ్లుగా ఈటీవీలో కనిపించని సుడిగాలి సుధీర్.. మళ్ళీ ఈటివి షోస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నాడంటూ ఏవేవో వార్తలు వినిపించాయి. సినిమా షూటింగ్స్, వేరే ఛానల్స్ ఆఫర్స్ తో సుడిగాలి సుధీర్ ఈటివిలో ఢీ డాన్స్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి క్రేజీ షోస్ వదులుకున్నాడు. మళ్ళీ ఆరు నెలలు గ్యాప్ తర్వాత సుధీర్ రీ ఎంట్రీ ఇస్తానంటే యాజమాన్యం ఒప్పుకోవడం లేదు, ఇకపై సుధీర్ ఈటీవీలో కనిపించడనే అనుకుంటున్నారు. 

అయితే తాజాగా సుడిగాలి సుధీర్ ఈటివి కి రీ ఎంట్రీ ఇచ్చేసాడనిపిస్తుంది. వచ్చే ఆదివారం రాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై సుధీర్ కనిపించాడు. మరో యాంకర్ రష్మి తో కలిసి సుధీర్ యాంకరింగ్ చేస్తూ సందడి చెయ్యడంతో పాటుగా తన ఇద్దరు ఫ్రెండ్స్ రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనులతో కలిసి హడావిడి చేసాడు. సుధీర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక బుల్లితెర మీద కనిపించకుండా సిల్వర్ స్క్రీన్ కే సుధీర్ అన్న పరిమితమవుతాడేమో.. అంటే ఏ ఆర్నెల్లకో, ఏడాదికో ఆయన సినిమా చూడడం తప్ప ఇకపై బుల్లితెర మీద కనిపించడేమో అని తెగ ఫీలైపోయారు.

రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుధీర్ కనిపించాడు అంటే.. ఇకపై జబర్దస్త్ లో కూడా కనిపిస్తాడేమో అని సుధీర్ ఫాన్స్ ఆరాటపడిపోతున్నారు, క్యూరియాసిటీ చూపిస్తున్నారు. మరి సుధీర్ పూర్తిగా ఈటీవిలోకి రీ ఎంట్రీ ఇచ్చాడనుకోవచ్చా.. లేదో ఆయనే చెప్పాలి.  

Sudigali Sudheer re-enters ETV:

Sudigali Sudheer in Sridevi Drama Company

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ