Advertisementt

ఏంటమ్మా.. సెలబ్రేషన్స్ కి బెస్ట్ : చరణ్

Thu 06th Apr 2023 10:08 PM
ram charan  ఏంటమ్మా.. సెలబ్రేషన్స్ కి బెస్ట్ : చరణ్
Ram Charan opens up about doing Yentamma song ఏంటమ్మా.. సెలబ్రేషన్స్ కి బెస్ట్ : చరణ్
Advertisement
Ads by CJ

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున్న మెరిసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఏంట‌మ్మా అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేష్‌లతో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన డాన్స్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట రిలీజైన రెండు రోజుల్లోనే అన్నీ సామాజిక మాధ్య‌మాల్లో క‌లిపి 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ను సాధించి దూసుకెళ్తోంది. 

ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ఈ సాంగ్‌కు సంబంధించిన బీటీఎస్ వీడియో ( స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లో ఏం జ‌రిగింద‌నే తెలియ‌జేసే వీడియో)ను గురువారం (ఏప్రిల్ 6)న రిలీజ్ చేశారు. జాతీయ స్థాయిలో తుఫానులా ప్ర‌భంజ‌నాన్ని సృష్టించిన పాట గురించి మ‌న RRR స్టార్ మ‌న‌సులో మాట‌ను తెలియ‌జేశారు. ఏంట‌మ్మా సాంగ్‌ను చేసేట‌ప్పుడు తెగ ఎంజాయ్ చేశాన‌ని, అంద‌రం క‌లిసి అద‌ర గొట్టేశామ‌ని అన్నారు మ‌న పాన్ ఇండియా స్టార్‌. 

ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోల‌తో క‌లిసి తాను ఏంటమ్మా సాంగ్‌లో న‌టించటం క‌ల నిజ‌మైన‌ట్లుగా ఉంద‌ని, మ‌ర‌చిపోలేని అనుభూతి అని చెబుతూ , ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్‌కి పండ‌గ‌లా ఉంటుంద‌ని అన్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఈ పాట‌లో క‌నిపించ‌ని ఎన‌ర్జీతో చాలా పాపుల‌ర్ అయ్యింది. 

Ram Charan opens up about doing Yentamma song:

It was a blast, the Global Star says in a BTS video

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ