మంచు వారింట్లో ఏం జరుగుతుంది.. ఇప్పుడిదే అందరిలో ఆసక్తికరంగా మారిన ప్రశ్న. మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూసాక నిజంగానే వాళ్ళ మధ్యన గొడవులున్నాయా.. అసలు మంచు విష్ణు దీన్ని కవర్ చెయ్యడానికే హౌస్ అఫ్ మంచు రియాలిటీ షో అంటూ బిల్డప్ ఇస్తున్నాడా.. అసలు మంచు విష్ణు కి మంచు మనోజ్ కి మధ్యన గొడవలున్నాయా.. సఖ్యత ఉందా.. ఇది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా మంచు విష్ణు-మంచు మనోజ్ మధ్యలో సఖ్యత లేదనేది తెలుస్తూనే ఉంది. ఈ మధ్యలో మోహన్ బాబు-మనోజ్ లు ఎక్కడ కనిపించినా విష్ణు వ్యవహారంపై స్పదించడం లేదు. రకరాల సెటైర్స్ తో దానిని సైడ్ చేస్తున్నారు.
తాజాగా మోహన్ బాబు, మనోజ్ అలాగే ఆయన భార్య మౌనికలు తిరుపతిలో ఓ ఆసుపత్రి ఓపెనింగ్ కి వెళ్లగా అక్కడ మీడియా వాళ్ళు మరోసారి విష్ణు-మనోజ్ వ్యవహారంపై స్పందించమని మోహన్ బాబుని అడగ్గా.. ఆయన కొద్దిగా సీరియస్ అయ్యారు. నీ ఇంట్లో నీకు నీ భార్య కి మధ్యలో ఎలాంటి సమస్యలుంటాయో.. మీ మధ్యన సంబంధం ఏమిటో చెప్పగలవా, అసలు మీరంతా చదువుకున్న వాళ్లే కదా, మీరంటే నాకిష్టం, నేను ఇక్కడికి వచ్చిన సందర్భం ఏమిటి, మీరు అడుగుతున్నది ఏమిటి, నేను వచ్చిన పనేంటి హాస్పిటల్ ఓపెనింగ్. ఇది అత్యద్భుతంగా ఉండాలి. డాక్టర్స్ మంచివాళ్లు ఉన్నారు.. అంటూ మోహన్ బాబు తపించుకున్నారు.
ఇక మంచు మనోజ్ ని కదపగా.. ప్రస్తుతం వాట్ ది ఫిష్, మనం మనం బరంపురం సినిమాలు స్టార్ట్ చేస్తున్నాను. కెనడాలో షూటింగ్ చేస్తాం. త్వరలో సినిమా క్యాస్ట్, షెడ్యూల్స్ అన్ని అప్డేట్ ఇస్తాం అని చెప్పాడు. ఇక రీసెంట్ ఇష్యూస్ పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అని అడగగా.. నాకు చిన్న సగ్గెడ్డ వచ్చిందండి.. గోకుతారా అంటూ ఎటకారంగా మనోజ్ స్పందించాడు కానీ.. విష్ణు వ్యవహారంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.