Advertisementt

పవన్ ఫాన్స్ తోనే గేమ్స్ ఆడతావా?

Thu 06th Apr 2023 02:19 PM
pawan fans,ustaad bhagat singh  పవన్ ఫాన్స్ తోనే గేమ్స్ ఆడతావా?
Do you play games with Pawan fans? పవన్ ఫాన్స్ తోనే గేమ్స్ ఆడతావా?
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని హరీష్ శంకర్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు. సినిమాని కమిట్ చేయించుకుని పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూసాడు. హరీష్ సినిమా ఒప్పుకున్నాక పవన్ రెండు సినిమాలు షూటింగ్స్ చేసేసారు. హారిష్ శంకర్ మాత్రం ఖాళీగా ఉండిపోయాడు. అయితే నిన్న బుధవారం నుండి పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ మొదలైనట్లుగా అప్ డేట్ ఇచ్చారు. అది కూడా పోలీస్ స్టేషన్ సెట్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో వెనుకగా కూర్చున్న పిక్ ని పోస్ట్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. 

అయితే ఆ పోస్టర్ చూసాక కొంతమంది ఆయన పవన్ కళ్యాణ్ కాదేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆయన పవన్ కళ్యాణ్ కాదు, ఆ పిక్ హరీష్ శంకర్ ది. ఫాన్స్ తోనే గేమ్ ఆడుతున్నావా హరీష్, ఎందుకు నీకు ఈ బిల్డప్, పవన్ పోస్టర్ నే రెడీ చేసి వదలొచ్చుగా.. ఇలా హడావిడిగా నీ పోస్టర్ వేసి మమ్మల్ని ఫూల్స్ చేస్తావా అని ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరైతే ఈ విధమైన ఘాటు ట్వీట్ వేసాడు. 

చేసేది రీమేక్లు, సినిమాలో ఫైట్స్ లో డూప్ పెట్టినా ఒక అర్థం ఉంటది. షూటింగ్ స్టార్ట్ అయింది అని జస్ట్ కుర్చీ లో కూర్చొని ఉన్న ఫోటో కి కూడా డూప్ ను పెట్టాలని ఎలా అనిపిస్తుంది. ఈ ఫోటో లో ఉన్నది హరీష్ శంకర్ అని పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఏదో ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తాం అన్నట్టు ఉంది.. అంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే హరీష్ మాత్రం అలా ఎందుకు చేస్తాడు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో సినిమా తీసేటప్పుడు ఆయన పోస్టర్ కాకుండా తన పోస్టర్ వదిలితే పవన్ కళ్యణ్ ఫాన్స్ ఊరుకుంటారా.. అసలు పవన్ ఫాన్స్ తో గేమ్ ఆడే దమ్ము హరీష్ కి ఉందా అనేది మరికొందరి వాదన.

Do you play games with Pawan fans?:

Pawan fans Troll Ustaad Bhagat Singh poster

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ