Advertisementt

పదే పదే సలార్ డేట్ పై క్లారిటీ?

Thu 06th Apr 2023 11:16 AM
salaar  పదే పదే సలార్ డేట్ పై క్లారిటీ?
Clarity on repeated Salaar date? పదే పదే సలార్ డేట్ పై క్లారిటీ?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే ప్రభాస్ ఆదిపురుష్ జూన్ 16 న విడుదల కాబోతుంది. మళ్ళీ మూడు నెలల గ్యాప్ లోనే ప్రభాస్ సలార్ విడుదల చేయడంపై పలు రకాల అనుమానాలు రేజ్ అయ్యాయి. ఎలాగూ ఇప్పటివరకు షూటింగ్ కూడా ఫినిష్ కాలేదు.. సో సలార్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సలార్ టీజర్ కూడా ఇప్పటివరకు రివీల్ చెయ్యలేదు అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకే మేకర్స్ పదే పదే సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తున్నారు. నిన్న కూడా సలార్ ట్విటర్ హ్యాండిల్ నుండి సలార్ ఖచ్చితంగా సెప్టెంబర్ 28 న రిలీజ్ అంటూ అప్ డేట్ ఇచ్చారు. అసలు చెప్పాపెట్టకుండా ఈ డేట్ పై మరోసారి క్లారిటీ ఇవ్వడం కొంతమందికి అర్ధం కావడం లేదు.

ప్రస్తుతం ప్రభాస్ సలార్ ఇటలీ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన పెంట్ హౌస్ సెట్ లో మారుతి మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక సలార్ షూట్ ఆల్మోస్ట్ ఫినిష్ అని.. ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తుంది.

Clarity on repeated Salaar date?:

 Salaar release date update 

Tags:   SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ