Advertisementt

నెగెటివిటీపై నాని డైరెక్ట్ పంచ్

Thu 06th Apr 2023 10:50 AM
nani,dasara  నెగెటివిటీపై నాని డైరెక్ట్ పంచ్
Nani direct punch on negativity నెగెటివిటీపై నాని డైరెక్ట్ పంచ్
Advertisement
Ads by CJ

నాని దసరా తో 100 కోట్ల మార్క్ ని టచ్ చేసి తన కెరీర్ లో మొదటిసారి 100 కోట్లు కొల్లగొట్టిన పోస్టర్ ని చూసుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కిన దసరా కేవలం 6 రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టింది. నిన్నరాత్రి దసరా సక్సెస్ సెలెబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే దసరా విడుదలైన మొదటి రోజు పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో ఆడియన్స్ హడావిడీ చేస్తుంటే.. కొంతమంది పనిగట్టుకుని దసరాపై విషం చిమ్మారు. దసరా ప్లాప్ అన్నారు, కలెక్షన్స్ తప్పుడు లెక్కలు చూపించుకుంటున్నారు అన్నారు, నాని దసరా ఏ విధంగా హిట్ అయ్యిందో చెప్పండి, బలమైన విలనిజం లేదు, నాని హీరోయిజానికి మ్యాచ్ అయ్యే నటులు లేరు.. ఇలా రకరకాలుగా నెగిటివిటి చూపించారు.

కావాలని పనిగట్టుకుని నాని దసరాపై విషం కుమ్మరించారు. అందుకే నాని కూడా దసరా సక్సెస్ సెలెబ్రేషన్ లో ఈ నెగిటివిటీపై డైరెక్ట్ గానే కామెంట్స్ చేసాడు. ఈ మధ్య కాలంలో ఒక కొత్త సినిమా విడుదలవుతుంది అంటే పెయిడ్ బ్యాచ్ తయారవుతున్నారు. ఈ సినిమా ఆడదు చూసుకో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నెగెటివిటీ అనే చెడుపైన ఈ రోజున మంచి గెలిచింది. దసరా అంటేనే చెడుపై మంచి గెలవడం.

స్టార్స్ అంతా సినిమాని సపోర్ట్ చేసారు. ప్రభాస్, మహేష్, సుకుమార్, రాజమౌళి గారు వీళ్లంతా దసరాకి సపోర్ట్ చేసారు. సినిమా హిట్ అవ్వబట్టే ఇప్పుడు ఇక్కడ మనం ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నామంటూ దసరాపై నెగిటివిటీ చూపించినవారికి డైరెక్ట్ గా నాని పంచ్ వేసాడు.

Nani direct punch on negativity:

Dasara Success Celebrations

Tags:   NANI, DASARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ