హీరోయిన్స్ ఇంతందంగా ఉన్నారు, అంతందంగా ఉన్నారు. ఈ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు. వారు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు, ఈ సారీ కట్టుకున్నారు అంటూ వర్ణించడం చూస్తుంటాము. కానీ అమ్మాయిల కన్నా ఎక్కువ పొగిడించుకునేలా ఒక్కోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు పిక్స్ బయటికి వస్తూ ఉంటాయి. 40 ప్లస్ లోను 25 ఏళ్ళ యువకుడిలా కనిపించే మహేష్ అందాన్ని ఏమని పొగడాలి, ఎంతని పొగడాలి. మహేష్-త్రివిక్రమ్ SSMB28 ఫస్ట్ లుక్ తోనే మాసివ్ గా దుమ్ము రేపిన మహేష్.. ఇప్పుడు OTTO బ్రాండ్ అంబాసిడర్ గా దానిని ప్రమోషన్ కోసం చేయించుకున్న స్పెషల్ షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
OTTO బ్రాండ్ షర్ట్స్ లో మహేష్ బాబు ఇచ్చిన ఫోజులు, ఆయన లుక్స్, ఆయన స్టయిల్ ఎంత చెప్పినా తరగదు. అచ్చం హాలీవుడ్ స్టార్ రేంజ్ లో మహేష్ ఆ దుస్తుల్లో కనిపించడం మహేష్ ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ప్రతి లుక్ లోను మహేష్ అందం హైలెట్ అయ్యింది. అందుకే ఆయన వేసుకున్న బ్రాండ్ కి అందమొచ్చింది. మహేష్ టీ షర్ట్స్, క్యాజువల్ వేర్స్ లో కనిపించి హ్యాండ్ సం మహేష్ అనేలా చేసారు. హెయిర్ స్టయిల్ కూడా ఆ పిక్స్ లో చాలా కొత్తగా కనిపించింది. ప్రస్తుతం మహేష్ ఈ కొత్త బ్రాండ్ లుక్ వైరల్ గా మారింది.
ఇక ఈ రోజు మహేష్ వెకేషన్స్ కి వెళ్ళబోతున్నారు. భార్య నమృత, కూతురు సితారలతో కలిసి కొద్దిరోజులు మహేష్ ఆ ట్రిప్ ఎంజాయ్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే నమ్రత, సితారలు పారిస్ వెళ్లిపోగా.. మహేష్ ఈరోజు బయలుదేరుతున్నారు.