యంగ్ టైగర్ ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కాంబోలో వార్ 2. ఇది చూడగానే ఎన్టీఆర్ ఫాన్స్ గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే అంటూ సాంగ్స్ వేసుకుంటుంటే.. మిగతా స్టార్ హీరోలకి దిమ్మ తిరిగిపోయింది. హమ్మ ఎన్టీఆర్ సైలెంట్ గా ఎంత పెద్ద కాంబో సెట్ చేసావ్.. ఏకంగా బాలీవుడ్ హీరో, అక్కడి దర్శకుడితో సినిమా సెట్ చేసుకుని.. గుట్టుచప్పుడు కాకుండా అప్ డేట్ ఇవ్వడం వెనుక ఎన్టీఆర్ ప్లానింగ్ ఎంతుందో అంటూ ఆయన అభిమానులైతే పొగిడేస్తుంటే.. చాలామంది ఇంకా ఆ షాక్ నుండి కోలుకోలేదు. ఎన్టీఆర్-హ్రితిక్ అంటే అలాంటి సెన్సేషన్ కాంబో మరి.
ఎన్టీఆర్-హ్రితిక్ కాంబోలో అయాన్ ముఖర్జీ సినిమా అనగానే ఫాన్స్ కయితే గూస్ బంప్స్ వచ్చేసాయి. ప్రస్తుతం ఈ సెన్సేషన్ న్యూస్ తో సోషల్ మీడియా షేకైపోతుంది. అయితే ఇప్పుడు వార్ 2 లో ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తాడా? లేదంటే హీరోగా కనిపిస్తాడా? అనేది ఫాన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్న. జై లవ కుశలో ఓ కేరెక్టర్ లో ఎన్టీఆర్ విలన్ గా అద్భుతః అనిపించాడు. అలాగే టెంపర్ లోను కాస్త నెగెటివ్ షేడ్స్ లోనే కనిపించి విమర్శకుల ప్రశంశలు పొందాడు. అయితే వార్ 2 లో హ్రితిక్ vs ఎన్టీఆర్ అంటున్నారు. ఒకరికొకరు తలపడతారనే టాక్ వినిపిస్తుంది. టైటిల్ కూడా అదే కదా మరి.
ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ దాక వెళ్లోచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్ట్ గా నార్త్ కి వెళ్ళిపోతున్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ అందరికన్నా ఇప్పుడు ఎన్టీఆర్ ఓ స్టెప్ ముందుకు వేసేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే చర్చ నడుస్తుంది. ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కలిస్తే బాక్సులు బద్దలైపోవడమే అని.