నిహారిక కొణిదెల కొద్దిరోజులుగా న్యూస్ లో నానుతున్న పేరు. కారణం ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డకి విడాకులు ఇవ్వబోతుందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో రేజ్ అవడమే. అంగరంగ వైభవంగా చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుని.. సోషల్ మీడియాలో హనీమూన్ అంటూ హడావిడి చేసిన నిహారికా ఇప్పుడు భర్తతో విడిపోతుంది అనే అనుమానాలు కలిగేలా ప్రవర్తించడమే ఎవరికీ అర్ధం కావడం లేదు. ఆ విషయం గురించి చైతూ కానీ నిహారికా కానీ, ఆఖరికి నాగబాబు కానీ స్పందించకుండానే కామైపోయారు. కానీ నిహారికా నటించిన వెబ్ సీరీస్ కోసం ఆమె మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది.
అయితే ఈ రోజు ఇన్స్టా వీడియోస్ లో నిహారికా మామిడికాయ ముక్కలు తింటూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో ఎంజాయ్ చేస్తుంది. ఆ వీడియో లో నిహారికా అలా పచ్చి మామిడికాయ ముక్కలు తింటూ కనిపించడంతో అందరూ.. ఏంటి నిహారికా స్పెషల్ న్యూస్ చెప్పబోతున్నావా అని కామెంట్ చేస్తున్నారు. సారీ కట్టుకుని ముక్కెర పెట్టుకుని లూజ్ హెయిర్ తో నిహారిక సింపుల్ గానే కనిపిస్తుంది.. ఆ లుక్ లో ఎన్నో అర్ధాలున్నాయి.
మరి నిహారిక ఏమైనా శుభవార్త వినిపిస్తుందో.. లేదంటే చైతన్య తో విడిపోతున్నట్లుగా చెప్పి బాధపెడుతుందో అంటూ నెటిజెన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు.