Advertisementt

నీ ప్లానింగ్ వేరే లెవల్ అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్

Wed 05th Apr 2023 04:59 PM
ntr-hrithik roshan  నీ ప్లానింగ్ వేరే లెవల్ అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్
NTR fans say your planning is on a different level నీ ప్లానింగ్ వేరే లెవల్ అంటున్న ఎన్టీఆర్ ఫాన్స్
Advertisement
Ads by CJ

నిన్నటివరకు ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ ని ఎంజాయ్ చేసినా.. NTR30 ఓపెనింగ్ విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ కి చాలా కంప్లైంట్స్ ఉండేవి. ఏడాది కాలంగా NTR30 అప్ డేట్ కోసం ఆయన అభిమానులు ఆరాటపడిపోయారు. ఎదురు చూడని క్షణమే లేదు. చివరికి ఫాన్స్ కి  ప్రష్టేషన్ వచ్చి సోషల్ మీడియాలో ఆగమాగం చేసి ఎన్టీఆర్ తో చివాట్లు కూడా తిన్నారు. ఎన్టీఆర్ కూడా ఆయన ఫాన్స్ చేసే చేష్టలకి విసుగు తెచ్చుకునే పొజిషన్ కి ఆయన ఫాన్స్ వచ్చేసారు. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు NTR30 పూజా కార్యక్రమాలే కాదు రెగ్యులర్ షూట్ కూడా షురూ చెయ్యడంతో ఫాన్స్ ఆనందపడి పోతున్నారు. 

దానికే ఇంత ఎగ్జైట్ అవుతున్న ఫాన్స్ కి అనుకోని తుఫానులా ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ కాంబో ఫిక్స్ అనే వార్త మరింతగా ఎగ్జైట్మెంట్ లోకి తోసేసింది. నిన్నటివరకు ఇతర హీరోలు దూసుకుపోతుంటే ఎన్టీఆర్ ఏమిట్రా ఇలా కామ్ గా ఉన్నాడని ఆందోళపడిన ఫాన్స్ కి ఎన్టీఆర్ ఇప్పుడు సర్ ప్రైజ్ లు మీద సర్ ప్రైజ్ లు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రెజెంట్ కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ.. ఇప్పుడు అస్సలు ఎవ్వరూ ఊహించని కాంబోని ఎన్టీఆర్ సెట్ చేయడం ఫాన్స్ ని భూమ్మీద నిలవనియ్యడమే లేదు.

అనుకోని అతిథిలా పలకరించిన ఈ బిగ్గెస్ట్ అప్ డేట్ ని ఎన్టీఆర్ ఫాన్స్ ఆస్వాదిస్తున్నారు.. ఎం ప్లానింగ్ ఎన్టీఆరు.. నీ ప్లానింగ్ వేరే లెవల్ అంటూ ఎన్టీఆర్ ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. చిన్న క్లూ లేదు, చిన్న ఊహాగానం లేదు, ఎన్టీఆర్ ముంబై వెళ్ళింది లేదు, ఆయన్ హైదరాబాద్ కి వచ్చింది లేదు , ఎలాంటి చప్పుడు లేకుండా ఇంత పెద్ద సెన్సేషన్ న్యూస్ ఒక్కసారిగా బయటకి రావడంతో ఫాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అందులోను బాలీవుడ్ దర్శకుడు-బాలీవుడ్ క్రేజీ హీరోతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఓకె అవడం అసలు సిసలైన క్రేజీ న్యూస్ అంటూ సంబరాల్లో మునిగిపోయారు వారు.  

NTR fans say your planning is on a different level:

Fans excited NTR-Hrithik Roshan Combo movie

Tags:   NTR-HRITHIK ROSHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ